SEBI Fine On Mukesh: ముకేష్ అంబానీకి భారీ జరిమానా విధించిన సెబీ… షేర్ల ట్రేడింగ్‌లో అవకతవకలే కారణం..
SEBI Imposes Fine On Mukesh Ambani: షేర్ల ట్రెడింగ్‌లో అవకతవకలకు సంబంధించి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీపై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ...

SEBI Imposes Fine On Mukesh Ambani: షేర్ల ట్రెడింగ్‌లో అవకతవకలకు సంబంధించి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీపై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (సెక్యూరిటీ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) రూ. 15 కోట్లు జరిమానా విధించించి. అంతేకాకుండా ముకేశ్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు రూ. 25 కోట్లతోపాటు నవీ ముంబై సెజ్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.20 కోట్లు, ముంబై సెజ్ లిమిటెడ్ రూ.10 కోట్ల మేర జరిమానా చెల్లించాలని సెబీ ఆదేశాలు జారీ చేసింది. ఆరోపణ ఏంటంటే.. 2007లో మార్చిలో రిలయన్స్ పెట్రోలియంలోని 4.1 శాతం వాటాను విక్రయించింది. ఇదే సమయంలో.. రిలయన్స్ పెట్రోలియం షేర్ల ధర పడిపోకుండా ఉండేందుకు ప్రణాళిక ప్రకారం తొలుత ఫ్యూచర్ మార్కెట్లో విక్రయించిన తర్వాత స్పాట్ మార్కెట్లో అమ్మకాలు జరిపి.. రిలయన్స్ ఇండస్ట్రీస్ అవకతవకలకు పాల్పడిందనేది సెబీ ప్రధాన ఆరోపణ. రియలన్స్ ఇండస్ట్రీస్ చేసిన మానిప్యులేటెడ్ ట్రేడింగ్‌కు ముకేశ్ అంబానీ బాధ్యత వహించాల్సి ఉంటుందని సెబీ తెలిపింది. రిలయన్స్ పెట్రోలియంలో తన వాటా షేర్ల విక్రయానికి సంబంధించి లావాదేవీల ట్రేడింగ్‌లో రియలన్స్ ఇండస్ట్రీస్ అవకతవకలకు పాల్పడిందని సెబీ అధికారి బీజే దిలీప్ తెలిపారు.
Also Read: Prices Up: కొత్త సంవత్సరంలో పెరగనున్న వస్తువుల ధరలు… ఏ ఏ వస్తువుల ధరలు పెరుగుతాయంటే..?