విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జనసేన తలపెట్టిన సభలో.. వైసీపీ సర్కార్‌పై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు పవన్ కళ్యాణ్. దేశ ప్రగతికి ఉక్కు కర్మాగారాలు చాలా ముఖ్యమన్న జనసేన అధినేత.. ఆంధ్రుల హక్కును ప్రైవేటు పరం చేస్తుంటే వైసీపీ ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. టీ, కాఫీలు తాగడానికే పార్లమెంట్ కు వెళ్తున్నారా? అని ప్రశ్నించారు. వారంలోగా అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ నాయకులకు ప్రజలు అవసరం లేదు.. డబ్బులు కాంట్రాక్టులే కావలంటూ విమర్శించారు పవన్.
వైజాగ్ స్టీల్స్ పరిరక్షణకు అఖిలపక్షం వేయాలనే డిమాండ్‌తో పవన్ డెడ్‌లైన్ విధించడంపై వైసీపీ ఘాటుగా రియాక్టయింది. ఎమ్మెల్యే అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు అంటూనే.. ఆంధ్ర ప్రభుత్వంపై పోరాటమా అంటూ ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేసే దమ్ము తనకు లేదని.. పవన్ సాబ్ తేల్చేశారంటూ ట్వీట్‌లో విమర్శించారు అంబటి రాంబాబు.
“విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు” అని
ఆంధ్ర ప్రభుత్వంపైనే పోరాడదాం !*కేంద్ర ప్రభుత్వంపై పోరాడే
దమ్ము లేదని తేల్చేసిన పవన్ సాబ్*— Ambati Rambabu (@AmbatiRambabu) October 31, 2021
కేంద్రాన్ని ఒప్పించాల్సింది పోయి.. దీక్షలకు దిగడం ఏంటో అర్థం కావడం లేదన్నారు రాష్ట్ర హోంమంత్రి సుచరిత. ఢిల్లీలో పోరాటం చేయకుండా ఇక్కడ దీక్షలేంటో అర్థం కావడం లేదన్నారు. గడిచిన 9 నెలలుగా పవన్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు వైసీపీ ఎమ్మెల్యే అమర్నాథ్. ఇప్పటికి 3 పార్టీలు మార్చారని.. రాబోయే రోజుల్లో ఎక్కడ ఉంటారో కూడా తెలియదన్నారు. తిరుపతి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఎలా మద్దతు ఇచ్చారని ప్రశ్నించారు. బీజేపీ అజెండాను పవన్ తన భుజాలపై మోసుకొచ్చారని.. కార్మిక సంఘాలు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
Also Read: వైసీపీ సర్కార్‌కు వారం డెడ్‌లైన్ విధించిన జనసేనాని.. చెవుల్లో క్యాబేజీలు పెట్టకండి అంటూ పంచ్