నా కుమారుడికి ఒక్క అవకాశం ఇచ్చి చూడండి

వైఎస్ పాలన ఒక్క జగన్‌తోనే సాధ్యమని, అతడికి ఒక్క అవకాశం ఇచ్చి చూడండి అంటూ వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ రాష్ట్ర ప్రజలను కోరారు. ఈ ఉదయం ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి ఘాట్‌ వద్ద ఆమె నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రస్తుత పాలన చూస్తే చాలా బాధ వేస్తోందని అన్నారు. ‘‘ఈ పది సంవత్సరాలలో జగన్.. కుటుంబం మధ్య కంటే ప్రజలతోనే ఎక్కువ మమేకమై ఉన్నాడు. ప్రజాసంకల్పయాత్రలో ప్రజల కష్టాలు చూశాడు. ప్రతి ఒక్కరికి […]

నా కుమారుడికి ఒక్క అవకాశం ఇచ్చి చూడండి

Edited By:

Updated on: Mar 29, 2019 | 8:07 AM

వైఎస్ పాలన ఒక్క జగన్‌తోనే సాధ్యమని, అతడికి ఒక్క అవకాశం ఇచ్చి చూడండి అంటూ వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ రాష్ట్ర ప్రజలను కోరారు. ఈ ఉదయం ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి ఘాట్‌ వద్ద ఆమె నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రస్తుత పాలన చూస్తే చాలా బాధ వేస్తోందని అన్నారు.

‘‘ఈ పది సంవత్సరాలలో జగన్.. కుటుంబం మధ్య కంటే ప్రజలతోనే ఎక్కువ మమేకమై ఉన్నాడు. ప్రజాసంకల్పయాత్రలో ప్రజల కష్టాలు చూశాడు. ప్రతి ఒక్కరికి నేనున్నానే భరోసా ఇచ్చాడు. విలువలకు, విశ్వసనీయతకు ప్రజలు పట్టం కట్టాలి. తాను చేసిన అభివృద్ధి కూడా చెప్పుకోలేని చంద్రబాబు.. ఎన్నికల ప్రచారంలో మాత్రం జగన్‌పై విమర్శలు చేస్తున్నారు’’ అని విజయమ్మ అన్నారు.

కాగా ఇవాల్టి నుంచి విజయమ్మ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఉదయం 10 గంటలకు కందుకూరులో జరిగే ప్రచార సభలో, మధ్యాహ్నం ఒంటి గంటకు కనిగిరిలో జరిగే సభలో, సాయంత్రం 4 గంటలకు మార్కాపురంలో జరిగే ప్రచార సభలో విజయమ్మ పాల్గొననున్నారు.