వివేకానంద‌ హత్యకేసులో పరమేశ్వర్ రెడ్డిపై అనుమానాలు

మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వివేకానందరెడ్డి హత్యకేసు విచారణపై అనేక అనుమానాలు ఉన్నాయని తెలిపారు ఆయన కూతురు సునీతా రెడ్డి. ఈనెల 15న వైఎస్ వివేకా పులివెందులలో తన సొంత నివాసంలోనే దారుణ హత్యకు గురయ్యారు. అయితే ఆ రోజు ఉదయం. 6:40 లకు తమకు తండ్రి మృతికి సంబంధించి సమాచారం అందిందన్నారు. డెత్ స్పాట్‌లో ఏం జరిగిందో సీఐకి తెలుసన్నారు. మరోవైపు తన తండ్రి హత్య కేసులో పరమేశ్వర రెడ్డి వ్యవహారం అనుమానాస్పందగా […]

వివేకానంద‌ హత్యకేసులో పరమేశ్వర్ రెడ్డిపై అనుమానాలు
Follow us

| Edited By:

Updated on: Mar 27, 2019 | 4:14 PM

మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వివేకానందరెడ్డి హత్యకేసు విచారణపై అనేక అనుమానాలు ఉన్నాయని తెలిపారు ఆయన కూతురు సునీతా రెడ్డి. ఈనెల 15న వైఎస్ వివేకా పులివెందులలో తన సొంత నివాసంలోనే దారుణ హత్యకు గురయ్యారు. అయితే ఆ రోజు ఉదయం. 6:40 లకు తమకు తండ్రి మృతికి సంబంధించి సమాచారం అందిందన్నారు. డెత్ స్పాట్‌లో ఏం జరిగిందో సీఐకి తెలుసన్నారు. మరోవైపు తన తండ్రి హత్య కేసులో పరమేశ్వర రెడ్డి వ్యవహారం అనుమానాస్పందగా ఉందన్నారు సునీతరెడ్డి. వివేకా హత్య జరిగిన రోజే పరమేశ్వర రెడ్డి ఆస్పత్రిలో చేరానన్నారు. తిరిగి అదే రోజు సాయంత్రం ఆస్పత్రి సిబ్బందితో గొడవకు దిగి డిశ్చార్జ్ అయ్యారని ఆరోపించారు.

నష్టపోయింది తన ఫ్యామిలీ అయితే.. మళ్లీ తమ కుటుంబంపైనే నిందలేస్తున్నారని ఆరోపించారు సునీతా రెడ్డి. వివేకా హత్యను రాజకీయంగా వాడుకుంటున్నారని ఆమె తీవ్రంగా విమర్శించారు. ఇప్పటికే ఈ హత్య కేసు విచారణపై ఆయన కుటుంబ సభ్యుల నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ అధినేత జగన్‍తో సహా వివేకా సతీమణి సౌభాగ్యమ్మ, కుమార్తె సునీతా రెడ్డి కేసు విచారణ జరుగుతున్న తీరుపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా హైకోర్టును ఆశ్రయించిన వివేకా సతీమణి సౌభాగ్యమ్మ.. కేసును విచారిస్తున్న ఏపీ పోలీసులపై కూడా తమకు నమ్మకం లేదని.. దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని పిటిషన్ దాఖలు చేశారు.