కేంద్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు లేఖ

కేంద్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు లేఖ

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు అధికారుల బదిలీల విషయంపై సిఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు.   కేంద్ర ఎన్నికల సంఘం తీరును తప్పుబడుతూ ఈసీకి ఏడు పేజీల లేఖ రాశారు. లేఖను తీసుకుని ఇప్పటికే టీడీపీ నేతలు కనకమేడల రవీంద్రకుమార్, జూపూడి ప్రభాకర్ ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. సీఎం రాసిన లేఖను ఈసీకి అందజేయనున్నారు. ఈసీ స్పందించకపోతే కోర్టును ఆశ్రయించాలని నిర్ణయం తీసుకున్నారు.  ఈసీ ఆదేశాలు తనను షాక్‌కు గురిచేసాయని ఆయన అన్నారు. అవినీతి పార్టీ వైసీపీ  ఫిర్యాదు చేస్తే […]

Ram Naramaneni

|

Mar 27, 2019 | 4:22 PM

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు అధికారుల బదిలీల విషయంపై సిఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు.   కేంద్ర ఎన్నికల సంఘం తీరును తప్పుబడుతూ ఈసీకి ఏడు పేజీల లేఖ రాశారు. లేఖను తీసుకుని ఇప్పటికే టీడీపీ నేతలు కనకమేడల రవీంద్రకుమార్, జూపూడి ప్రభాకర్ ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. సీఎం రాసిన లేఖను ఈసీకి అందజేయనున్నారు. ఈసీ స్పందించకపోతే కోర్టును ఆశ్రయించాలని నిర్ణయం తీసుకున్నారు.  ఈసీ ఆదేశాలు తనను షాక్‌కు గురిచేసాయని ఆయన అన్నారు. అవినీతి పార్టీ వైసీపీ  ఫిర్యాదు చేస్తే కనీస ప్రాథమిక విచారణ చేయకుండానే 24 గంటల్లో చర్యలు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు.

ఇంటెలిజెన్స్ డీజీ ఎన్నికల విధుల పరిధిలోకి రారని.. అలాంటప్పుడు ఆ పోస్టులో ఉన్న వ్యక్తిని ఎలా బదిలీ చేస్తారని ప్రశ్నించారు. బదిలీలకు కారణాలు కూడా ఈసీ సరిగ్గా చూపించలేకపోయిందని చంద్రబాబు అన్నారు. మోదీ-జగన్-కేసీఆర్ ఈ కుట్రలకు కారణమని లేఖలో చంద్రబాబు ఆరోపించారు.  ఈసీ కూడా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుందని.. బదిలీలను వెనక్కి తీసుకోవాలని బాబు కోరారు.

పలు అవినీతి కేసుల్లో A2 ముద్దాయిగా ఉన్న వ్యక్తులిచ్చిన ఫిర్యాదుపై కూాడ ఇంతలా స్పందించడం దారుణం అన్నారు. తాము కూడా ఫామ్-7 విషయంలో వైసీపీపై పిర్యాదు చేశామని మరి దానిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. వివేకా హత్య కేసులో కడప ఎస్పీ నిజాయితీగా దర్యాప్తు చేస్తున్న సమయంలో కడప ఎస్పీ బదిలీ వెనుక రాజకీయ కారణాలు లేవా?  అని లేఖలో ఆయన ప్రశ్నించారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu