
గుంటూరులోని మంగళగిరిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు వైసీపీ అధినేత జగన్. ఈ సందర్బంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఐదేళ్లలో చంద్రబాబుకు గుర్తుకురాని ప్రజలు ఐదునెలల ముందు గుర్తొచ్చారా..? అని ప్రశ్నించారు. చంద్రబాబు వల్ల అమరావతిలో రైతులకు రక్షణే లేకుండా పోయిందన్నారు. కానీ.. రైతులకు ఎలాంటి సమస్యలు వచ్చినా.. వారి తరుపున కోర్టుకు కూడా వెళ్లడానికి నేను సిద్ధమని అన్నారు. అంతేకాకుండా.. మహిళలకు సున్నా వడ్డీ రుణాలను మళ్లీ తీసుకొస్తామన్నారు. అలాగే.. మంగళగిరిలో పవన్ కల్యాణ్ ప్రచారం చేయరు.. భీమవరంలో చంద్రబాబు ప్రచారం చేయరు.. వీళ్లిద్దరి పొత్తుకు ఇదే నిదర్శనమంటూ జగన్ సెటైర్ వేశారు.