సోఫిటెల్ ఎదుట కాంగ్రెస్ కార్యకర్తల ధర్నా
ముంబైలో కర్నాటక కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు బస చేసిన హోటల్ ముందు తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. సోఫిటెల్ హోటల్‌ను కాంగ్రెస్ కార్యకర్తలు ముట్టడించారు. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. గోవా లాగే కర్నాటకలో కూడా బీజేపీ తమ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టిందని ఆరోపించారు. కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తీవ్రవాగ్వాదం జరిగింది. సోఫిటెల్ హోటల్ దగ్గరకు అదనపు బలగాలను తరలించారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా […]
ముంబైలో కర్నాటక కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు బస చేసిన హోటల్ ముందు తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. సోఫిటెల్ హోటల్‌ను కాంగ్రెస్ కార్యకర్తలు ముట్టడించారు. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. గోవా లాగే కర్నాటకలో కూడా బీజేపీ తమ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టిందని ఆరోపించారు.
కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తీవ్రవాగ్వాదం జరిగింది. సోఫిటెల్ హోటల్ దగ్గరకు అదనపు బలగాలను తరలించారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా డైరక్షన్‌లోనే ఇదంతా జరుగుతోందని కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపించారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో బీజేపీ కుట్రలను అడ్డకుంటామని స్పష్టం చేశారు.