‘దీదీ ! మీరు నా తలను తన్నవచ్చు , కానీ బెంగాలీల కలలను మాత్రం చిదిమిపోనివ్వను, ప్రధాని మోదీ

| Edited By: Phani CH

Mar 21, 2021 | 7:36 PM

బెంగాల్  ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ కొత్త పుంతలు తొక్కుతున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు సరి కొత్త పదజాలాన్ని వాడుతున్నారు.  బంకురాలో ఆదివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన..

దీదీ ! మీరు నా తలను తన్నవచ్చు , కానీ బెంగాలీల కలలను మాత్రం చిదిమిపోనివ్వను, ప్రధాని మోదీ
Pm Modi
Follow us on

బెంగాల్  ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ కొత్త పుంతలు తొక్కుతున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు సరి కొత్త పదజాలాన్ని వాడుతున్నారు.  బంకురాలో ఆదివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన.. దీదీ పాలనపై ధ్వజమెత్తారు. ఈ పదేళ్లలో ఈ రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. ఆమె హయాంలో ఇక్కడి ప్రజలకు దక్కిందేమీ లేదన్నారు. బీజేపీ ఇక్కడ అధికారంలోకి వస్తే మార్పును వారు చూస్తారని, సోనార్ బంగ్లా ఆవిర్భవిస్తుందని చెప్పారు. అంతే కాదు.. ‘దీదీ ! మీరు నా తలపై కాలు పెట్టి నా తలను తన్నవచ్చు.. కానీ బెంగాలీల కలలను మాత్రం చిదిమిపోనివ్వను’ అని వ్యాఖ్యానించారు.   తృణమూల్ కాంగ్రెస్ ‘గేమ్’ మే 2 న అంతం కావాలని ఈ రాష్ట్ర ప్రజలు నిర్ణయించుకున్నారని ఆయన చెప్పారు. అవినీతికర ఆటలు ఇక సాగవని,  కాషాయ పార్టీ ఇక్కడ మార్పును తేవడం ఖాయమని అన్నారు. గత పదేళ్లుగా మీరు  (మమతా బెనర్జీ) పసలేని హామీలు ఇస్తూ వస్తున్నారని, మీరు చేసినట్టు చెప్పుకుంటున్న ఒక్క అభివృద్ధి కార్యక్రమం ఈ రాష్ట్రంలో  ఒక్కటైనా ఉందా అని మోదీ ప్రశ్నించారు.

ఈవీఎంల పని తీరు గురించి మళ్ళీ మీరు మాట్లాడుతున్నారని, ఇవి లోపభూయిష్ఠమైనవిగా విమర్శిస్తున్నారని, కానీ మిమ్మల్ని పదేళ్లుగా అధికారంలో ఉంచింది ఇవేనని ఆయన చెప్పారు. నాడు కనబడని లోపాలు నేడు కనిపిస్తున్నాయా అని ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో మీరు మీ ఓటమిని అప్పుడే అంగీకరించినట్టు ఉన్నారని, అందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. అవినీతి రహిత వ్యవస్థ కోసం ప్రజలు బీజేపీకే ఓటు వేయాలన్నారు.తన ముఖం కూడా చూడాలనిపించడం లేదని మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యపై ఆయన.. ప్రజాస్వామ్యంలో ప్రజాసేవ ముఖ్యమని, అంతేగానీ ముఖాలు కావని కౌంటరిచ్చ్చారు.  అయినా ఈ రాష్ట్ర ప్రజలకు అన్నీ తెలుసునన్నారు. బీజేపీ ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజల ఆశయాలను, ఆశలను తీరుస్తుందని హామీ ఇస్తున్నా అన్నారు .

 

మరిన్ని ఇక్కడ చదవండి: Vakeel Saab: వకీల్ సాబ్‌‌కి ముందుగా అనుకున్న ఇంట్రస్టింగ్ టైటిల్ ఏంటో తెలుసా..? గెస్ చేయగలరా

Floating Stones in India : మనదేశంలో ఏ సైంటిస్ట్ కూడా చెప్పలేని వింతలు.. గాలిలో తేలియాడే రాళ్లు