కర్నాటకలో దాదాపు మూడు వారాలపాటు కొనసాగిన హైడ్రామాకు తెరపడింది. కుమారస్వామి సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది. దీంతో.. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీ కసరత్తు ప్రారంభించింది. కాసేపట్లో.. బీజేఎల్పీ సమావేశం ప్రారంభం కానుంది. అనంతరం.. యడ్యూరప్ప.. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాలతో సమావేశమవుతారు. గవర్నర్ ఆహ్వానించిన తరువాత బీజేపీ.. ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశముంది. యడ్యూరప్ప నాల్గవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అమిత్‌షాకు యడ్యూరప్ప రాసిన సుధీర్గమైన లేఖలో తమ పార్టీ ఎమ్మెల్యేలంతా ఒకే గాటన ఉన్నారని ఎవరూ ప్రలోభాలకు తలొగ్గలేదని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో యడ్యూరప్ప తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో సమావేశయ్యారు. కాగా.. తమ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలను ఆయన మంత్రులుగా తీసుకోవచ్చునని తెలుస్తోంది. రేపు సీఎంతో పాటు వీరు ప్రమాణ స్వీకారం చేయవచ్చునని అధికారిక సమాచారం. అటు.. రెబల్ ఎమ్మెల్యేల భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారింది. స్పీకర్ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇంకా ముంబై క్యాంపులోనే రెబల్ ఎమ్మెల్యేలు ఉన్నారు.