ఎంత ఆపినా ఆగలేదు.. కట్టలు తెంచుకున్న దుఖం.. తల్లి కోసం వెక్కి వెక్కి ఏడ్చేశాడు.. ఈ నాయకుడి బాధేంటో తెలిస్తే..

|

Sep 23, 2021 | 3:28 PM

AP MPTC ZPTC Polls 2021: ఆశించేది ఎంపీ పదవి కాదు.. ఎమ్మెల్యే పదవి అంతకన్నా కాదు.. కానీ కన్నీరు మాత్రం కట్టలు తెంచుకుంది.. అవునూ.. మండల స్థాయిలో ఉండే ఓ పదవి కోసం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు.

ఎంత ఆపినా ఆగలేదు.. కట్టలు తెంచుకున్న దుఖం.. తల్లి కోసం వెక్కి వెక్కి ఏడ్చేశాడు.. ఈ నాయకుడి బాధేంటో తెలిస్తే..
Mpp
Follow us on

ఆశించేది ఎంపీ పదవి కాదు.. ఎమ్మెల్యే పదవి అంతకన్నా కాదు.. కానీ కన్నీరు మాత్రం కట్టలు తెంచుకుంది.. అవునూ.. మండల స్థాయిలో ఉండే ఓ పదవి కోసం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు ఓ స్థానిక నేత. ఆ పదవి తమ వారికే దక్కాలని ధర్నాకు దిగాడు. కొన్నేళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నారు.. ఈసారి పదవి తమకే వస్తుందనుకున్నారు.. కానీ సడెన్‌గా వేరే వారికి పదవి రావడంతో వారిలో కన్నీరు కట్టలు తెంచుకుంది. ఆ పదవి తమకే రావాలని ఆందోళన దిగారు. ఇంతకీ వీళ్లు ఆశిస్తున్న పదవి ఎంపీ, ఎమ్మెల్యే పదవి ఏం కాదు.. మండల స్థాయిలో ఉండే ఎంపీపీ పదవి.. అవునూ ఎంపీపీ పదవి కోసం ధర్నాకు దిగారు.

అఖండ మెజార్టీతో గెలిచిన వైసీపీ పార్టీ నేతలు పండగ చేసుకుంటున్నారు. అయితే కొందరు మాత్రం ఇలా రోదిస్తూ కనిపిస్తున్నారు. దానికి కారణం.. వారికి ఎంపీపీ పదవి కావాలని.. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ విషయంలో అంతగా విభేదాలు కనిపించలేదు. కానీ ఎంపీపీ పదవి కోసం మాత్రం ఆశావహులు ఏడ్చే వరకు వెళ్లింది పరిస్థితి. ఈ సీన్‌ కర్నూలు జిల్లా కోడుమూరు నిమోజకవర్గంలో కనిపించింది.

కోడుమూరు నియోజవర్గంలో ఎమ్మెల్యే సుధాకర్ సమన్వయకర్త కోట్ల హర్షవర్థన్ రెడ్డి మధ్య చాలా రోజులుగా విభేదాలు ఉన్నాయి. గూడూరు ఎంపీపీ పదవి తన తల్లికి వస్తుందని వైసీపీ నేత నరసింహారెడ్డి ఆశించారు. గూడూరు మండలంలోని కే నాగలాపురం నుంచి ఎంపీటీసీగా నరసింహారెడ్డి తల్లి రాజమ్మ గెలుపొందింది. ఇక గూడూరు ఎంపీపీ తల్లి రాజమ్మకు ఖాయం అనుకుంటున్న సమయంలో గత ఎన్నికల సందర్భంగా పార్టీలో చేరిన చనుగొండ్ల కు చెందిన ప్రతాప్ రెడ్డి తన భార్యకు ఎంపీపీ పదవి ఇప్పించుకునేందుకు చక్రం తిప్పారు.

ఇంతకాలం కష్టపడితే పదవి వస్తుందనుకున్న సమయంలో వేరే వాళ్ళు తన్నుకపోవడం పట్ల నరసింహారెడ్డి కన్నీటిపర్యంతమయ్యారు. దుఃఖం పట్టలేక బోరున విలపించారు. తన తల్లి గ్రామ కార్యకర్తలతో కలిసి నాగలాపురం వైఎస్ఆర్ విగ్రహం దగ్గర ధర్నాకు దిగారు… కష్టపడిన కార్యకర్తలకు సీఎం జగన్ న్యాయం చేయాలని బోరున విలపించారు. ఇలాంటి సీన్లు ఇప్పుడు ఏపీలో చాలా చోట్ల కనిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి: MP Bharath: రాజమండ్రి ఎంపీ భరత్ ఒక వైపు, ఎమ్మెల్యే రాజా మరోవైపు. మధ్యలో రైతులు!