ఈ కాలపు మహిళలు ఎలా ఉన్నారంటే , డీఎంకే అభ్యర్థి తరఫున వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యాంకర్

| Edited By: Phani CH

Mar 25, 2021 | 4:49 PM

DMK Candidate Dindigul Leoni: తమిళనాడు ఎన్నికల  సందర్భంగా డీఎంకే అభ్యర్థి తరఫున ప్రచారం చేసిన ఓ యాంకర్ మహిళలపట్ల అనుచిత, అసభ్య వ్యాఖ్యలు చేశాడు. దిండిగుల్ లియోనీ అనే ఈయన..

ఈ కాలపు మహిళలు ఎలా ఉన్నారంటే , డీఎంకే అభ్యర్థి తరఫున వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యాంకర్
Dmk Candidate Dindigul Leoni
Follow us on

DMK Candidate Dindigul Leoni: తమిళనాడు ఎన్నికల  సందర్భంగా డీఎంకే అభ్యర్థి తరఫున ప్రచారం చేసిన ఓ యాంకర్ మహిళలపట్ల అనుచిత, అసభ్య వ్యాఖ్యలు చేశాడు. దిండిగుల్ లియోనీ అనే ఈయన.. మహిళలను  విదేశీ ఆవులతో పోల్చాడు. కోయంబత్తూరులో డీఎంకే అభ్యర్థి  కార్తికేయ శివసేనాపతి తరఫున ఎన్నికల సభలో మాట్లాడుతూ.. ఈ మహిళలు విదేశీ ఆవుల పాలను తాగి పిప్పళ్లబస్తాల్లా లావుగా మారుతున్నారని అన్నాడు.  విదేశీ ఆవుల పొదుగుల నుంచి యంత్రాలతో పాలను సేకరిస్తున్న విషయాన్ని మరువరాదన్నాడు . ఆ పాలను తాగిన వీరు బ్యారెల్స్ లా మారిపోతున్నారని, తమ  చిన్న పిల్లలను కూడా సరిగా ఎత్తుకోలేకపోతున్నారని విమర్శించాడు. ఆ ఆవులు 40 లీటర్ల వరకు పాలను ఇస్తాయన్నాడు. ఒకప్పుడు మహిళలు సన్నగా ఉండి  తమ చిన్న పిల్లలను సులభంగా నడుముకి ఎత్తుకునే వారని, కానీ ఇప్పుడా పరిస్థితి లేదని దిండిగుల్ లియోనీ పేర్కొన్నాడు.  ‘మహిళలు తమ షేపులను కోల్పోతున్నారు…ఫిగర్ 8 అన్నది ఇప్పుడు లేనేలేదు..; అని ఇలాగే ఇంకా  పలు అనుచిత కామెంట్స్ చేశాడు. ఈయన గారి ఈ వ్యాఖ్యలు వీడియోలో వైరల్ గా మారడంతో నెటిజన్లు ఇక ఇతడ్ని ఓ ‘ఆట  ఆడుకున్నారు’.

పలువురు రాజకీయ నాయకులు కూడా ఈ క్లిప్ ని తమ ట్విటర్ కి జోడిస్తూ వీటిని ఖండించారు. ఇది చాలా షేమ్ ఫుల్ అని, ఈయన ఏ పాలను తాగుతున్నాడని, ఈ విధమైన యాంకర్ ను  తన ప్రచారానికి  డీఎంకే అభ్యర్థి ఎలా నియమించుకున్నారని వారు ప్రశ్నించారు.లియోనీ వంటివారికి వెంటనే ఉద్వాసన చెప్పాలని కూడా వారు డిమాండ్ చేశారు. అటు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ కూడా ఇలా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆమె గాయపడిన తన కాలును చూపినప్పుడు ఎలా ప్రవర్తించారని ఆయన అన్నారు. ఆయన కామెంట్స్ కూడా వివాదాస్పదమయ్యాయి.  .

మరిన్ని ఇక్కడ చదవండి: ఇకపై ఆర్ఎస్ఎస్ ని ‘సంఘ్ పరివార్’ అని పిలిస్తే ఒట్టు ! కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ

AP Corona Cases: ఏపీలో మరోసారి పడగ విప్పిన కరోనా.. ఏకంగా 758 కేసులు.. పెరిగిన మరణాల సంఖ్య