కాంగ్రెస్‌తో వైసీపీ కలవనుందా..?
కేంద్రంలో మళ్లీ ఢిల్లీ కుర్చీపై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ తనతో కలసివచ్చే పార్టీలతో దృష్టి పెడుతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో తనకు మద్దతిచ్చే పార్టీల మీద ఫోకస్ పెట్టిన కాంగ్రెస్.. జగన్ నేతృత్యవంలోని వైసీపీ వైపు ఆశగా చూస్తోందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే.. తెలంగాణ సీఎం కేసీఆర్ కాంగ్రెస్‌తో కలిసేది లేదని తేల్చి చెప్పేశారు. దీంతో.. వైసీపీకి దగ్గర కావడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలను వేగవంతం చేసిందట. ఎన్నికల ముందే ఫెడరల్ ఫ్రంట్‌కి సంబంధించి టీఆర్ఎస్ […]

కేంద్రంలో మళ్లీ ఢిల్లీ కుర్చీపై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ తనతో కలసివచ్చే పార్టీలతో దృష్టి పెడుతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో తనకు మద్దతిచ్చే పార్టీల మీద ఫోకస్ పెట్టిన కాంగ్రెస్.. జగన్ నేతృత్యవంలోని వైసీపీ వైపు ఆశగా చూస్తోందని వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికే.. తెలంగాణ సీఎం కేసీఆర్ కాంగ్రెస్‌తో కలిసేది లేదని తేల్చి చెప్పేశారు. దీంతో.. వైసీపీకి దగ్గర కావడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలను వేగవంతం చేసిందట. ఎన్నికల ముందే ఫెడరల్ ఫ్రంట్‌కి సంబంధించి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జగన్‌తో ఓసారి సమావేశం కూడా అయ్యారు. ఈ సమావేశంతో.. జగన్ కేసీఆర్‌తో కలిసి వెళ్తారా..? అన్న ప్రశ్నలు కూడా వినిపించాయి. సిద్ధాంత పరంగా ఈ పార్టీల పోకడలు రెండూ వేరువేరు అయినప్పటికీ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు జగన్ మరీ విముఖంగా లేరని తెలుస్తోంది. ఇందుకు కారణం కేవలం టీడీపీనే టార్గెట్‌గా చేసుకున్న ఆయన ఇప్పటివరకూ కాంగ్రెస్ పార్టీపై నేరుగా ఎలాంటి విమర్శలు చేయకపోవడమే.
కాగా.. ఇప్పటికే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జగన్‌తో ఫోన్‌లో మాట్లాడారన్న ప్రచారం ఉపందుకుంది. అయితే.. వైసీపీ ఈ వ్యవహారం ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గుంభనంగా ఉంది. ఈ నెల 23న బీజేపీయేతర పార్టీలతో కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న సమావేశానికి వైసీపీని కూడా ఆహ్వానిస్తారని రాజకీయవర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా.. వైసీపీ అధినేత జగన్ మాత్రం తన మద్దతు ఎవరికన్న దానిపై స్పష్టత ఇవ్వలేదు. కాగా.. జగన్ ఇదివరకే ఏపీకి ఎవరు ప్రత్యేక హోదా ఇస్తే వారికే తన మద్దతని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ కూడా తాము అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించింది. ఇరు పార్టీలూ ఒకే గళం వినిపించడంతో మే 23న ఏం జరుగుతుందన్న దానిపై ఆసక్తి పెరుగుతోంది.
అటు.. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో ఏపీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చెట్టాపట్టాలేసుకుని మరింత చేరువయ్యారు. ఎప్పటికప్పుడు ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌తో టచ్‌లో ఉంటున్నారు. అలాగే.. బీజేపీయేతర పార్టీలతోనూ మీటింగ్‌లు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో మరో కీలక పార్టీ అయిన వైసీపీ మద్దతు కోసం కాంగ్రెస్ చూస్తుండటంతో పొలిటికల్ హీట్ పెరిగిన దాఖలాలు కనబడుతోన్నాయి. అయితే.. ఇప్పటికైనా జగన్ క్రాంగెస్‌కి చేరువవుతారా..? ఆ పార్టీ చేస్తోన్న ప్రయత్నాలకు సానుకూలంగా స్పందిస్తారా..? అన్న ప్రశ్నలు ఉత్కంఠ రేపుతోన్నాయి.