2019 ఎన్నికల ఖర్చు దాదాపుగా రూ.50,000 కోట్లు

| Edited By:

Mar 12, 2019 | 3:38 PM

ప్ర‌పంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలంటే అత్యంత ఖర్చుతో కూడుకున్న పని. ఈసారి పార్లమెంట్ ఎన్నికలు ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఎన్నికలుగా నిలువనున్నాయి. ఉత్తరాన హిమాలయ శ్రేణి నుంచి దక్షిణాన హిందూ మహాసముద్రం వరకు.. పశ్చిమాన థార్ ఎడారి నుంచి తూర్పున సుందర్‍బాన్ అడవుల వరకు ఆరు వారాల పాటు ఈ ఎన్నికలు జరగనున్నాయి. పార్లమెంట్ ఎన్నికలు ఈసారి ఏప్రిల్ 11న‌ ప్రారంభమై… మే 19న ముగుస్తాయి. ఈ ఎన్నికలకు ఏకంగా దాదాపు రూ.50,000 కోట్ల (7 […]

2019 ఎన్నికల ఖర్చు దాదాపుగా రూ.50,000 కోట్లు
Follow us on

ప్ర‌పంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలంటే అత్యంత ఖర్చుతో కూడుకున్న పని. ఈసారి పార్లమెంట్ ఎన్నికలు ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఎన్నికలుగా నిలువనున్నాయి. ఉత్తరాన హిమాలయ శ్రేణి నుంచి దక్షిణాన హిందూ మహాసముద్రం వరకు.. పశ్చిమాన థార్ ఎడారి నుంచి తూర్పున సుందర్‍బాన్ అడవుల వరకు ఆరు వారాల పాటు ఈ ఎన్నికలు జరగనున్నాయి.

పార్లమెంట్ ఎన్నికలు ఈసారి ఏప్రిల్ 11న‌ ప్రారంభమై… మే 19న ముగుస్తాయి. ఈ ఎన్నికలకు ఏకంగా దాదాపు రూ.50,000 కోట్ల (7 బిలియన్ డాలర్లు) వ్యయం కానుందని సెంటర్ పర్ మీడియా స్టడీస్ (సీఎంఎస్) అంచనా వేసింది. 2016లో అమెరికా అధ్యక్ష ఎన్నికల ఖర్చు (6.5 బిలియన్ డాలర్లు) కన్నా ఇది ఎక్కువ కావడం గమనించదగ్గ విషయం. 2014 లోక్‌సభ ఎన్నికల ఖర్చు 5 బిలియన్ డాలర్లుగా ఉండొచ్చని అంచనా.

సోషల్ మీడియా, ట్రావెల్, అడ్వర్టైజింగ్ ఖర్చు భారీగా పెరిగే అవకాశముందని సీఎంఎస్ అంచనా వేసింది. 2014లో రూ.250 కోట్లుగా ఉన్న సోషల్ మీడియా వ్యయాలు ఇప్పుడు రూ.5,000 కోట్లకు చేరొచ్చని పేర్కొంది. పార్టీ లీడర్లు, అభ్యర్థుల ట్రావెల్ ఖర్చులు కూడా విపరీతంగా పెరగొచ్చని తెలిపింది.

సుమారుగా 545 స్థానాలకు పోటీ చేస్తున్న 8,000 మంది పోటీదారులు, ఓటర్లను గెలవడానికి బహుమతులు అనేవి తప్పనిసరిగా అయింది. సమాఖ్య స్థాయి భారతీయ రాజకీయ నాయకులలో 90 శాతం మంది తమ సహచరులకు నగదు, ఆల్కాహాల్ లేదా ఇతర వ్యక్తిగత వస్తువులు వంటి బహుమతులు అందజేయాలనే ఒత్తిడి ఉంది..