ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వనున్న జేడీ..!

చివరి నిమిషంలో జనసేనలో చేరి ఆ పార్టీ నుంచి టికెట్‌ను దక్కించుకున్నారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ. వైజాగ్ నుంచి ఆయన లోక్‌సభ స్థానానికి పోటీ పడబోతున్నారు. ఈ క్రమంలో తన ప్రత్యర్థులకు జేడీ గట్టి పోటీ ఇవ్వబోతున్నట్లు రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. వైజాగ్ నియోజకవర్గానికి టీడీపీ నుంచి బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీ భరత్, వైఎస్సార్‌సీపీ నుంచి ప్రముఖ బిల్డర్ ఎమ్‌వీవీ సత్యనారాయణ పోటీ చేస్తున్నారు. వీరిలో రూరల్ ఓటర్ల నుంచి సత్యనారాయణకు మద్దతు […]

ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వనున్న జేడీ..!

Edited By:

Updated on: Mar 22, 2019 | 4:08 PM

చివరి నిమిషంలో జనసేనలో చేరి ఆ పార్టీ నుంచి టికెట్‌ను దక్కించుకున్నారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ. వైజాగ్ నుంచి ఆయన లోక్‌సభ స్థానానికి పోటీ పడబోతున్నారు. ఈ క్రమంలో తన ప్రత్యర్థులకు జేడీ గట్టి పోటీ ఇవ్వబోతున్నట్లు రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.

వైజాగ్ నియోజకవర్గానికి టీడీపీ నుంచి బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీ భరత్, వైఎస్సార్‌సీపీ నుంచి ప్రముఖ బిల్డర్ ఎమ్‌వీవీ సత్యనారాయణ పోటీ చేస్తున్నారు. వీరిలో రూరల్ ఓటర్ల నుంచి సత్యనారాయణకు మద్దతు ఉంది. అలాగే పలు ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్స్‌ కలిగిన శ్రీ భరత్‌కు స్టూడెంట్స్‌ నుంచి మద్దతు ఉంది. ఇక జేడీ లక్ష్మీనారాయణ విషయానికి వస్తే మధ్యతరగతి కుటుంబాలు, కొత్తతరం ఓటర్ల నుంచి ఆయనకు సపోర్ట్ ఇచ్చేందుకు ఆసక్తిని చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురి మధ్య పోటీ గట్టిగా ఉండబోతుందని రాజకీయ నిపుణులు అంటున్నారు. మరి ఈ త్రిముఖ పోటీలో ఎవరు గెలుస్తారో చూడాలంటే మే 23వరకు ఆగాల్సిందే.