ప్రధాని మోదీపై విరుచుకుపడ్డ పశ్చిమ బెంగాల్ సీఎం

కోల్‌కతా : ప్రధాని నరేంద్రమోదీపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రధాని మోదీ కాలం చెల్లిపోయిన బాబు (వ్యక్తి) అంటూ ఎద్దేవా చేశారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో దిన్హాతాలో నిర్వహించిన ఓ బహిరంగ సభలో పాల్గొన్న ఆమె.. బీజేపీపై విమర్శలు గుప్పించారు. సిలిగురి సభలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను మమతా బెనర్జీ తిప్పికొట్టారు. నేను స్వామి వివేకానంద, రవీంద్ర నాథ్ ఠాగూర్ లాంటి వారు పుట్టిన నేలపై జన్మించానని అన్నారు. […]

ప్రధాని మోదీపై విరుచుకుపడ్డ పశ్చిమ బెంగాల్ సీఎం
Follow us

| Edited By:

Updated on: Apr 03, 2019 | 9:10 PM

కోల్‌కతా : ప్రధాని నరేంద్రమోదీపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రధాని మోదీ కాలం చెల్లిపోయిన బాబు (వ్యక్తి) అంటూ ఎద్దేవా చేశారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో దిన్హాతాలో నిర్వహించిన ఓ బహిరంగ సభలో పాల్గొన్న ఆమె.. బీజేపీపై విమర్శలు గుప్పించారు. సిలిగురి సభలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను మమతా బెనర్జీ తిప్పికొట్టారు. నేను స్వామి వివేకానంద, రవీంద్ర నాథ్ ఠాగూర్ లాంటి వారు పుట్టిన నేలపై జన్మించానని అన్నారు. బెంగాల్‌లో టీఎంసీ పాలన గురించి ప్రధాని మోదీ అసత్యాలు చెబుతున్నారని మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్‌లో మా పాలనలో రైతుల ఆదాయం మూడు రెట్లు పెరిగిందన్నారు. దేశంలో మోదీ పాలన వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. మోదీ కాలం చెల్లిపోయిన బాబు అని వ్యాఖ్యానించారు.

ప్రధాని మోదీకి ధైర్యం ఉంటే తనతో టీవీ స్టూడియోలో లేదా ప్రజా దర్బార్‌లో చర్చలో పాల్గొనాలంటూ సవాల్ విసిరారు. మత ఘర్షణలు చెలరేగే విధానాలను నేను ఒప్పుకోనని అన్నారు. భారత ఆర్మీని బీజేపీ వారు మోదీ సేనగా అభివర్ణించడం సిగ్గుచేటని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు.