తెలంగాణలో తగ్గనున్న ఓటింగ్‌ శాతం?

తెలంగాణ రాష్ట్రంలో శాసనసభకు ముందస్తు ఎన్నికలు జరగడంతో లోక్‌సభ ఎన్నికలపై పెద్దగా ఆసక్తి కనిపించడం లేదు. ఓట్ల పండగకు ఊరెళ్లాలనే ఆలోచన పట్టణవాసుల్లో కనిపించడం లేదు. ప్రధాన పార్టీలు కూడా అసెంబ్లీ ఎన్నికలంత ఆసక్తి చూపడం లేదు. రాజకీయ పార్టీలు కూడా ఆ స్థాయిలో హోరాహోరీ ప్రచారం చేయడం లేదు. ఒక పార్లమెంట్‌ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండటం వల్ల పోటీ చేసే అభ్యర్థులు కూడా ప్రతి చోటికీ వెళ్లి ప్రచారం చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. […]

  • Tv9 Telugu
  • Publish Date - 4:59 pm, Mon, 8 April 19
తెలంగాణలో తగ్గనున్న ఓటింగ్‌ శాతం?

తెలంగాణ రాష్ట్రంలో శాసనసభకు ముందస్తు ఎన్నికలు జరగడంతో లోక్‌సభ ఎన్నికలపై పెద్దగా ఆసక్తి కనిపించడం లేదు. ఓట్ల పండగకు ఊరెళ్లాలనే ఆలోచన పట్టణవాసుల్లో కనిపించడం లేదు. ప్రధాన పార్టీలు కూడా అసెంబ్లీ ఎన్నికలంత ఆసక్తి చూపడం లేదు. రాజకీయ పార్టీలు కూడా ఆ స్థాయిలో హోరాహోరీ ప్రచారం చేయడం లేదు. ఒక పార్లమెంట్‌ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండటం వల్ల పోటీ చేసే అభ్యర్థులు కూడా ప్రతి చోటికీ వెళ్లి ప్రచారం చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీంతోపాటు రాష్ట్రంలో తొలి విడతలోనే ఎన్నికలు జరుగుతుండటంతో ప్రచారానికి ఎక్కువ సమయం లేకుండాపోయింది. మరోవైపు ఏ జిల్లాలో చూసినా కనీస ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. ఎండ ధాటికి జనం ఇల్లు దాటి బయటికి వచ్చేందుకే భయపడుతున్నారు. పార్టీలు నిర్వహించే బహిరంగ సభలకు కూడా జనం హాజరు ఎక్కువగా ఉండటం లేదు.