AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆలీపై పవన్ సంచలన వ్యాఖ్యలు!

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజమండ్రి ప్రచార సభలో వైసీపీ నేత ఆలీపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు కష్టాల్లో ఆలీకి అండగా ఉన్నానని, స్నేహమంటే ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. ఆలీని వైసీపీ నేతలు వాడుకుంటున్నారని, ఆలీకి ఎంపీ టికెట్‌ ఇస్తామంటే వైసీపీలో చేరాడని తెలిపారు. రాజమండ్రిలోని కోటిపల్లి బస్టాండ్ సెంటర్‌లో పవన్ రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్‌పై నిప్పులు చెరిగారు. కన్నబాబు లాంటి చెంచాలు అవసరం […]

ఆలీపై పవన్ సంచలన వ్యాఖ్యలు!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 08, 2019 | 5:28 PM

Share

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజమండ్రి ప్రచార సభలో వైసీపీ నేత ఆలీపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు కష్టాల్లో ఆలీకి అండగా ఉన్నానని, స్నేహమంటే ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. ఆలీని వైసీపీ నేతలు వాడుకుంటున్నారని, ఆలీకి ఎంపీ టికెట్‌ ఇస్తామంటే వైసీపీలో చేరాడని తెలిపారు. రాజమండ్రిలోని కోటిపల్లి బస్టాండ్ సెంటర్‌లో పవన్ రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్‌పై నిప్పులు చెరిగారు. కన్నబాబు లాంటి చెంచాలు అవసరం లేదన్నారు. వైఎస్‌ బావమరిది రవీంద్రారెడ్డి సినిమా తీయాలని బెదిరించారని పవన్‌ మండిపడ్డారు.

ఆలీ వైసీపీలో చేరడంపై గతంలో పవన్ తన అభిప్రాయాన్ని మీడియాకు తెలిపారు. జగన్ బలమైన నాయకుడని ఆలీ భావించాడు కాబట్టే వైసీపీలో చేరి ఉంటాడని వ్యాఖ్యానించారు. ఆలీ జనసేనలో చేరాలనే నియమం లేదన్నారు. ఆలీకి కూడా వ్యక్తిగత అభిప్రాయాలుంటాయని, ప్రత్యేకంగా ఆయనకు ఓ నిర్ణయం ఉంటుందని చెప్పుకొచ్చారు. తానెప్పుడు స్టార్ పవర్‌ను నమ్ముకోలేదని, ఆలీ వేరే పార్టీలో చేరినంత మాత్రాన తనకేం నష్టం జరగదని పవన్ అన్నారు.

Follow Us