AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijayawada corporation elections : బోండా ఉమ, బుద్దా బ్లాస్ట్..! కేశినేని కూతురు దిద్దిన బెజవాడ రాజకీయం, టీడీపీకి విజయాన్ని అందిస్తుందా?

పార్టీ అన్నాక ఆధిపత్య పోరు కామన్‌. ఎప్పటి నుంచో ఇది ఉన్నా ఇప్పుడే ఎందుకు బ్లాస్ట్‌ అయింది. కార్పొరేషన్‌ ఎన్నికల్లో కలిసి కట్టుగా పని చేయాల్సిన వాళ్లు... ఎందుకిలా రచ్చకెక్కారు...

Vijayawada corporation elections : బోండా ఉమ, బుద్దా బ్లాస్ట్..!  కేశినేని కూతురు దిద్దిన బెజవాడ రాజకీయం, టీడీపీకి విజయాన్ని అందిస్తుందా?
Venkata Narayana
|

Updated on: Mar 06, 2021 | 7:22 PM

Share

Vijayawada corporation elections : పార్టీ అన్నాక ఆధిపత్య పోరు కామన్‌. ఎప్పటి నుంచో ఇది ఉన్నా ఇప్పుడే ఎందుకు బ్లాస్ట్‌ అయింది. కార్పొరేషన్‌ ఎన్నికల్లో కలిసి కట్టుగా పని చేయాల్సిన వాళ్లు… ఎందుకిలా రచ్చకెక్కారు. సీట్ల పంపకాల్లో వచ్చిన తేడాలే కారణమా? అధిష్టానం జోక్యంతో అంతా సమిసిపోయినట్లేనా? కేశినేని కూతురు దిద్దిన రాజకీయం బెజవాడలో తెలుగుదేశం పార్టీకి విజయాన్ని అందిస్తుందా? అనేది ఇప్పుడు విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో హాట్ టాపిక్.

బెజవాడ టీడీపీకి ఇప్పుడు కార్పొరేషన్‌ ఎన్నికల్లో గెలుపు ఎంతో ఎంతో ముఖ్యం. ఎందుకంటే అమరావతి ప్రభావం ఇక్కడ ఉందని నిరూపించుకోవాలంటే… పార్టీకి ఇది చావో రేవో సమస్యలాంటిదే. అలాంటి ఈ ఎన్నికల్లోనే తమ్ముళ్ల మధ్య తగాదా రచ్చకెక్కింది. ఎప్పటి నుంచో కేశినేని నాని ఆధిపత్యాన్ని తట్టుకోలేకపోతున్న బోండా ఉమ, బుద్ధాలు కనీసం ఎన్నికల్లోనైనా పైచేయి సాధించాలని ప్రయత్నించారు. ఇక్కడ కూడా వారికి ఒకరకంగా ఇబ్బందులే ఎదురయ్యాయి. పైగా చంద్రబాబు టూర్‌ రూట్‌ మ్యాప్‌ను తమకు చెప్పరా అన్నది వీరి అభ్యంతరం. అందుకే ప్రెస్‌మీట్‌ పెట్టి ఛాలెంజ్‌లు విసిరారన్నది పార్టీలో టాక్‌.

బుద్ధా పరిధిలో ఉన్న పశ్చిమ నియోజకవర్గంలోని 39వ డివిజన్‌ అభ్యర్థి ప్రకటన పెద్ద దుమారమే రేపింది. ఏడాది కిందటే పూజితను తెరపైకి తెచ్చి అభ్యర్థిగా ప్రకటించారు వెంకన్న. ఇప్పుడు ఆమెను కాదని కొత్తగా వచ్చిన శివ వర్మకు టిక్కెట్‌ వచ్చేలా చేశారు కేశినేని. అదే మరింత వివాదాన్ని రాజేసింది. ఎంపీని ఏకంగా రోడ్డుపైనే నిలదీశారు బుద్ధా వర్గీయులు. బోండా ఉమ ఉన్న సెంట్రల్‌ నియోజకవర్గంలోని 31వ డివిజన్‌లోనూ ఇలాగే జరిగింది. ఉమ మద్దతు ఇచ్చిన అభ్యర్థికి కాకుండా.. గోగుల రమణకు కేశినేని టిక్కెట్‌ ఇప్పించారనేది తీవ్ర అసంతృప్తికి కారణమైంది. ఇలా వీరిద్దరూ నాని తీరుపై ఒకరకంగా రగిలిపోతున్నారు. పాత విభేదాలు.. కొత్త గొడవలు.. ఇలా రచ్చకెక్కేలా చేసింది. కార్యకర్తల్లోనూ తీవ్ర గందరగోళం నెలకొంది.

మేయర్‌ అభ్యర్థి అంశంలోనూ ఉమకు, కేశినేని నానికి కొంత గ్యాప్‌ వచ్చింది. క్షత్రియ సామాజికవర్గమైన గాయత్రికి మద్దతు ఇచ్చారు బోండా. అధిష్టానం మాత్రం శ్వేతకు ఫైనల్‌ చేసింది. అయితే ఈ విషయంలో సర్దుకుపోయే ధోరణిలోనే ఉన్నారు నేతలు. మరోవైపు ఎన్నికల్లో ఎన్ని విభేదాలు ఉన్నా… గెలుపు బాధ్యత తనదే అన్నారు కేశినేని నాని. మిగిలిన నేతలకు కౌంటర్‌ ఇస్తూనే… ఒక ట్విస్ట్‌ కూడా ఇచ్చారు కేశినేని. తనకు చంద్రబాబుకు మధ్య ఈక్వేషన్స్‌ వేరని కామెంట్‌ చేశారు. ఈ మాటలు అన్న కొద్దిసేపటికే అధిష్టానం నుంచి ఫోన్లు వెళ్లాయి. పార్టీలో రేగిన దుమారాన్ని చల్లార్చే ప్రయత్నం చేశారు పెద్దలు. చంద్రబాబు, అచ్చెన్నాయుడు… బోండా, బుద్ధాలతో మాట్లాడారు. ఆ తర్వాత కేశినేని నాని కూతురు శ్వేత.. బోండా ఉమ ఇంటికి వెళ్లారు. కలిసి పని చేద్దామని, మద్దతు ఇవ్వాలని కోరారు.

దాంతో చంద్రబాబు టూర్‌లో శ్వేతతో కలిసి ప్రచారం చేస్తామని ప్రకటించారు బుద్ధా. జరిగిన దాన్ని మరిచిపోయి కలిసికట్టుగా పని చేస్తామని ప్రకటించారు శ్వేత. ప్రస్తుతానికి కేశినేని కూతురు శ్వేత తాజా రాజకీయ దుమారాన్ని సరిదిద్దేందుకు తన వంతు ప్రయత్నం చేశారు. అధిష్టానం కూడా ఫోకస్‌ పెట్టింది కాబట్టి… ఇక్కడితో దీనికి ఫుల్‌స్టాప్‌ పడుతుందా? కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాలపై ఈ ప్రభావం ఉంటుందా? అన్నది మరికొద్ది రోజుల్లోనే తేలిపోతుంది.

Read also : Telangana MLC elections : ఎమ్మెల్సీ ఎన్నికల సిత్రాలు, భారీ డైలాగులు, ఓట్లు వేయకపోతే నాశనమైపోతారంటూ శాపనార్దాలు