రాజేంద్రప్రసాద్‌కు వంశీ క్షమాపణ

వల్లభనేని వంశీ.. ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారారు.  టీడీపీ అధినేత చంద్రబాబుపై, నారా లోకేశ్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారాయన. గురువారం టీవీ9 బిగ్‌ డిబేట్‌లో టీడీపీ నేత రాజేంద్రప్రసాద్‌పై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు దుమారం రేపాయి. అయ్యప్ప మాలలో ఉండి ఇంత పచ్చిగా మాట్లాడతారా అంటూ టీడీపీ నేతలు కౌంటర్‌ ఇచ్చారు. అయితే ఈరోజు మీడియా ముందుకొచ్చిన వంశీ.. చాలా కూల్‌గా పద్దతిగా.. అద్భుతమైన సాహిత్య భాషతో చురకలంటించారు. మొన్నటి అనుచిత వ్యాఖ్యలకు రాజేంద్రప్రసాద్‌కు […]

రాజేంద్రప్రసాద్‌కు వంశీ క్షమాపణ
Follow us
Ram Naramaneni

| Edited By:

Updated on: Nov 16, 2019 | 9:23 PM

వల్లభనేని వంశీ.. ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారారు.  టీడీపీ అధినేత చంద్రబాబుపై, నారా లోకేశ్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారాయన. గురువారం టీవీ9 బిగ్‌ డిబేట్‌లో టీడీపీ నేత రాజేంద్రప్రసాద్‌పై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు దుమారం రేపాయి. అయ్యప్ప మాలలో ఉండి ఇంత పచ్చిగా మాట్లాడతారా అంటూ టీడీపీ నేతలు కౌంటర్‌ ఇచ్చారు. అయితే ఈరోజు మీడియా ముందుకొచ్చిన వంశీ.. చాలా కూల్‌గా పద్దతిగా.. అద్భుతమైన సాహిత్య భాషతో చురకలంటించారు. మొన్నటి అనుచిత వ్యాఖ్యలకు రాజేంద్రప్రసాద్‌కు క్షమాపణ చెప్పారు. మొదట రాజేంద్ర ప్రసాదే నోరు జారారన్న వంశీ… వయసులో పెద్ద వ్యక్తి.. తనను అలా అనేసరికి తట్టుకోలేకపోయానని పేర్కొన్నారు.

తనకు  రాజకీయంగా అండగా నిలిచింది చంద్రబాబే అన్న వంశీ..చంద్రబాబుకు కూడా కాంగ్రెస్‌ రాజకీయ భిక్ష పెట్టిందని.. ఆయన కూడా అదే పార్టీలోనే కొనసాగారా అని ప్రశ్నించారు. బాబు..ఎన్టీఆర్‌ని అన్న మాటలు అందరికి గుర్తున్నాయని..తన ఒక్కడి విషయంలోనే నైతిక విలువలు తెరపైకి రావడం విడ్డూరంగా ఉందన్నారు వంశీ.