పవన్ కళ్యాణ్ ఇక నీ డ్రామాలు ఆపు: కొడాలి నాని

చంద్రబాబునాయుడు, దేవినేని ఉమాను టార్గెట్‌ చేస్తూ ఏపీ మంత్రి కొడాలి నాని తీవ్రంగా విరుచుకుపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు 23  మంది ఎమ్మెల్యేలను లాక్కుని జగన్‌ను తిట్టించినప్పుడు లేని పైశాచిక ఆనందం ఇప్పుడెందుకని నిలదీశారు. చంద్రబాబులా ఎవరికీ జగన్‌ కండువాలను కప్పలేదన్న నాని.. స్వతహాగా వారే వచ్చారని గుర్తుచేశారు. సన్నబియ్యం ఇస్తామని తామెప్పుడూ చెప్పలేదన్న కొడాలి.. నాణ్యమైన బియ్యాన్ని మాత్రమే ఇస్తామన్నారు. దేవినేని ఉమా చేస్తున్న విమర్శలపై తీవ్రస్థాయిలో నాని ధ్వజమెత్తారు. గతంలో కాంగ్రెస్‌ పార్టీని మోసగించి టీడీపీలోకి […]

పవన్ కళ్యాణ్ ఇక నీ డ్రామాలు ఆపు: కొడాలి నాని
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 16, 2019 | 5:17 PM

చంద్రబాబునాయుడు, దేవినేని ఉమాను టార్గెట్‌ చేస్తూ ఏపీ మంత్రి కొడాలి నాని తీవ్రంగా విరుచుకుపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు 23  మంది ఎమ్మెల్యేలను లాక్కుని జగన్‌ను తిట్టించినప్పుడు లేని పైశాచిక ఆనందం ఇప్పుడెందుకని నిలదీశారు. చంద్రబాబులా ఎవరికీ జగన్‌ కండువాలను కప్పలేదన్న నాని.. స్వతహాగా వారే వచ్చారని గుర్తుచేశారు. సన్నబియ్యం ఇస్తామని తామెప్పుడూ చెప్పలేదన్న కొడాలి.. నాణ్యమైన బియ్యాన్ని మాత్రమే ఇస్తామన్నారు. దేవినేని ఉమా చేస్తున్న విమర్శలపై తీవ్రస్థాయిలో నాని ధ్వజమెత్తారు. గతంలో కాంగ్రెస్‌ పార్టీని మోసగించి టీడీపీలోకి వెళ్లిన దేవినేని ఉమా.. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు తోడుగా నిలిచాడని విరుచుకుపడ్డారు. ఉమాను కొడాలి నాని వ్యక్తిగతంగా కూడా టార్గెట్‌ చేశారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై కూడా నాని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

కొడాలి నాని ప్రెస్ మీట్‌లోని ముఖ్యాంశాలు:

  • గతంలో చంద్రబాబు మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేేశాడు
  • ప్రజలకు ఏప్రిల్ నుంచి క్వాలిటీ  బియ్యం ఇవ్వబోతున్నాం
  • చంద్రబాబును గుడ్డిగా నమ్మి దేవినేని అవినాశ్ మోసపోయాడు
  • జగన్ మీద ఆరోపణలు చేయడానికి ఏమీ లేక కులం, మతం, తిరుపతి ప్రసాదం గురించి మాట్లాడుతున్నారు
  • పవన్ కళ్యాణ్ ,చంద్రబాబు పార్టనర్స్
  • పవన్ కళ్యాణ్…డ్రామాలు ఆపితే మంచిది
  • రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి  ప్రశ్నిస్తే సీఎం జగన్  సమాధానం చెప్పాలా..?
  • తిరుపతి వెళ్లివచ్చిన తర్వాతే పాదయాత్ర మొదలెట్టిన విషయం గుర్తులేదా..?
  • వల్లభనేని వంశీని ఇన్నాళ్లు పార్టీ మారకుండా బ్లాక్‌ మెయిల్ చేశారు
  • వరదలు ఉంటే ఇసుక తీయడం ఎలా సాధ్యం..?
  • లోకేశ్ వల్లే టీడీపీలో సంక్షోభం
  • లోకేశ్‌ వల్ల పార్టీ మునిగిపోతుందనే భయంతోనే టీడీపీ నాయకులు పార్టీ మారుతున్నారు
  • ఇసుక దీక్షకు సొంతపార్టీ ఎమ్మెల్యేలు హాజరుకాలేదు
  • చంద్రబాబు టైం అయిపోయింది..ఇక 100 జన్మలు ఎత్తినా సీఎం అవ్వలేడు