కారున్నా.. ‘ఆరోగ్య శ్రీ’కి అర్హులే..!

ఏపీ ప్రజలకు.. జగన్ ప్రభుత్వం మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. కారున్న వారికి కూడా.. ఆరోగ్య శ్రీ పథకం వర్తిస్తుందని.. అధికారులు తెలిపారు. అంతేకాకుండా.. వార్షిక ఆదాయం రూ.5 లక్షలు ఉన్నవారు కూడా ఈ పథకం కింద ప్రయోజనం పొందవచ్చునని స్పష్టం చేశారు. తాజాగా.. వైఎస్‌ఆర్ ఆరోగ్య శ్రీ పథకం విస్తరణకు సంబంధించి ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. వీరికి ఆరోగ్య శ్రీ పథకం వర్తిస్తుంది: అన్ని రకాల బియ్యం కార్డులున్న వారందరికీ ఈ పథకం […]

  • Updated On - 5:48 pm, Fri, 15 November 19 Edited By:
కారున్నా.. 'ఆరోగ్య శ్రీ'కి అర్హులే..!

ఏపీ ప్రజలకు.. జగన్ ప్రభుత్వం మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. కారున్న వారికి కూడా.. ఆరోగ్య శ్రీ పథకం వర్తిస్తుందని.. అధికారులు తెలిపారు. అంతేకాకుండా.. వార్షిక ఆదాయం రూ.5 లక్షలు ఉన్నవారు కూడా ఈ పథకం కింద ప్రయోజనం పొందవచ్చునని స్పష్టం చేశారు. తాజాగా.. వైఎస్‌ఆర్ ఆరోగ్య శ్రీ పథకం విస్తరణకు సంబంధించి ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది.

వీరికి ఆరోగ్య శ్రీ పథకం వర్తిస్తుంది:

  • అన్ని రకాల బియ్యం కార్డులున్న వారందరికీ ఈ పథకం వర్తిస్తుంది.
  • పింఛన్ కార్డు ఉన్నవారు అర్హులే.. ఇంకా ఈ కార్డు దారులు కూడా ఈ పథకం కింద ప్రయోజనం పొందవచ్చు.
  • జగనన్న విద్యా కార్డ్
  • వసతి దీవెన కార్డు
  • ప్రభుత్వ ఉద్యోగం ఉన్నవారు
  • 12 ఎకరాల కన్నా తక్కువ మాగాణి పొలం ఉన్నవారు
  • 35 ఎకరాల కన్నా తక్కువ మెట్ట భూములు ఉన్నవారు
  • 5 లక్షల కన్నా వార్షిక ఆదాయం ఉన్నా దీనికి అర్హులవుతారు
  • ఆఖరికి ఒక కారున్నవారికి కూడా ఈ పథకం వర్తిస్తుంది.