రామాలయ నిర్మాణానికి ముస్లిం లీడర్ విరాళం

అయోధ్యలో రామాలయ నిర్మాణానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునివ్వడంపట్ల ముస్లిం నాయకుడొకరు హర్షం వ్యక్తం చేశారు. ఈ ఆలయ నిర్మాణానికి తాను రూ. 51 వేల విరాళం ఇస్తున్నట్టు ప్రకటించారు. యూపీ షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డు చైర్మన్ వసీం రిజ్వీ ఈ మేరకు చేసిన ప్రకటన అందరికీ ఆశ్చర్యం కలిగించింది. అయోధ్యలో రాముని గుడి నిర్మాణాన్నీ తమ బోర్డు సమర్థిస్తోందని, దశాబ్దాల తరబడి నలుగుతున్న ఈ సమస్యపై అత్యున్నత న్యాయస్థానం ఉత్తమమైన తీర్పునిచ్చిందని ఆయన అన్నారు. రామజన్మ […]

రామాలయ నిర్మాణానికి ముస్లిం లీడర్ విరాళం

అయోధ్యలో రామాలయ నిర్మాణానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునివ్వడంపట్ల ముస్లిం నాయకుడొకరు హర్షం వ్యక్తం చేశారు. ఈ ఆలయ నిర్మాణానికి తాను రూ. 51 వేల విరాళం ఇస్తున్నట్టు ప్రకటించారు. యూపీ షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డు చైర్మన్ వసీం రిజ్వీ ఈ మేరకు చేసిన ప్రకటన అందరికీ ఆశ్చర్యం కలిగించింది. అయోధ్యలో రాముని గుడి నిర్మాణాన్నీ తమ బోర్డు సమర్థిస్తోందని, దశాబ్దాల తరబడి నలుగుతున్న ఈ సమస్యపై అత్యున్నత న్యాయస్థానం ఉత్తమమైన తీర్పునిచ్చిందని ఆయన అన్నారు. రామజన్మ స్థానంలో గుడి నిర్మాణానికి సన్నాహాలు మొదలయ్యాయని, రాముడు మనందరికీ ‘ పూర్వీకుడని ‘ (పరోక్షంగా దేవుడేనని) వసీం పేర్కొన్నారు. ఇండియాలోనూ, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రామ భక్తులందరికీ.. ఆలయ నిర్మాణమన్నది గర్వ కారణమని ఆయన వ్యాఖ్యానించారు. తన పేరిట నిర్వహిస్తున్న ‘ వసీం రిజ్వీ ఫిలిమ్స్ ‘ తరఫున ఆయన ఈ విరాళాన్ని ప్రకటించారు.