పెళ్లిళ్ల సీజన్‌లో గుడ్ న్యూస్..తగ్గిన బంగారం ధరలు

గత కొంతకాలంగా జెడ్ స్పీడుతో దూసుకెళ్తున్న బంగారం ధరలు..కాస్త అదుపులోకి వచ్చాయి. దీంతో పసిడిప్రియులు ఊపిరి పీల్చుకున్నారు.  దేశీ జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ తగ్గడం వంటి కారణాల వల్ల బంగారం ధరలు దిగిరావడానికి కారణమవుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు బంగారంపై పెట్టుబడులు కూడా బలహీనంగా ఉన్నాయి. దీంతో 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాముల ధర నేడు రూ.149 తగ్గడం విశేషం. అలాగే బంగారం ధరతో పాటే పలు చోట్ల వెండి ధరల్లో కూడా […]

  • Ram Naramaneni
  • Publish Date - 6:15 pm, Fri, 15 November 19
పెళ్లిళ్ల సీజన్‌లో గుడ్ న్యూస్..తగ్గిన బంగారం ధరలు

గత కొంతకాలంగా జెడ్ స్పీడుతో దూసుకెళ్తున్న బంగారం ధరలు..కాస్త అదుపులోకి వచ్చాయి. దీంతో పసిడిప్రియులు ఊపిరి పీల్చుకున్నారు.  దేశీ జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ తగ్గడం వంటి కారణాల వల్ల బంగారం ధరలు దిగిరావడానికి కారణమవుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు బంగారంపై పెట్టుబడులు కూడా బలహీనంగా ఉన్నాయి. దీంతో 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాముల ధర నేడు రూ.149 తగ్గడం విశేషం. అలాగే బంగారం ధరతో పాటే పలు చోట్ల వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది. పెళ్లిళ్ల సమయం కావడంతో ముందుగా ఆర్డర్ ఇవ్వడానికి కూడా ఇదే సరైన సమయమని వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు.

 

ఢిల్లీలో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర: రూ.38,875

కిలో వెండి ధర : రూ.45,375

……………………………….

హైదరాబాద్‌లో 24 క్యారెట్ బంగారం ధర: రూ.38, 790

హైదరాబాద్‌లో 1 కేజీ వెండి ధర:  రూ.48,650