Uttam Kumar Reddy : కరోనా నుంచి కోలుకుంటూనే పొలిటికల్‌ పంచ్‌లు పేల్చిన ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి..

ఇటీవల తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఆయన కోలుకుంటూనే...

Uttam Kumar Reddy  : కరోనా నుంచి కోలుకుంటూనే పొలిటికల్‌ పంచ్‌లు పేల్చిన ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి..
Uttam-Kumar-Reddy

Updated on: Apr 29, 2021 | 3:49 PM

ఇటీవల తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఆయన కోలుకుంటూనే పోలిటికల్‌ పంచ్‌లు విసిరారు. ఆసుపత్రి నుంచి ఉత్తమ్‌ పంపిన వీడియో సందేశం రాజకీయంగా హాట్‌ టాపిక్‌గా మారింది. తన ఆరోగ్యం గురించి ప్రార్థించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూనే ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ప్రజల దీవెనలతో రెండు మూడు రోజుల్లో డిశ్చార్జి అయి ఇంటికి వస్తానని ఉత్తమ్‌ పేర్కొన్నారు. పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించాలని ఉత్తమ్‌ డిమాండ్‌ చేశారు. ప్రజలకు వైద్య సేవలు అందించడం ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత అన్నారు. కరోనాకు చికిత్సను ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చాలని ఉత్తమ్‌ డిమాండ్‌ చేశారు. కరోనాను అరికట్టడంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు.

కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులు కరోనా బాధితుల కోసం గాంధీ భవన్‌తోపాటు రాష్ట్ర వ్యాప్తంగా కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసి సేవలు చేస్తున్నారని ఈ సందర్భంగా ఉత్తమ్‌ తెలిపారు. వారందరినీ ఆయన అభినందించారు. కరోనా బారిన పడిన వారికి సరైన వైద్య సేవలు అందక నానా ఇబ్బందులు పడుతుండటం అత్యంత బాధాకరమన్నారు. ఆసుపత్రిలో పడకలు దొరక్క, ఆక్సిజన్‌ లేక, వెంటిలేటర్లు, ఔషధాలు, రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు దొరక్క కొవిడ్‌ బాధితులు పడుతున్న బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయని ఉత్తమ్‌ ఆవేదన వ్యక్తం చేశారు.


Also Read:   కరోనాపై సోషల్‌ మీడియాలో ప్రచారాలు.. వాస్తవాలపై క్లారిటీ ఇచ్చిన డబ్ల్యూహెచ్‌వో

 నిజామాబాద్‌ జిల్లాలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు ఊహించని షాక్‌.. చేప‌ల కోసం వ‌ల వేస్తే..