పెట్టుబడుల విషయంలో కేంద్రం, తెలంగాణ మధ్య కొత్త రగడ మొదలైంది. దావోస్‌లో ఒప్పందాలపై టీఆర్‌ఎస్ (TRS) చేస్తున్న హడావుడిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) తప్పుబట్టారు. స్విట్జర్లాండ్ సంస్థ స్టాడ్లర్ రైల్ పెట్టుబడి గురించి టీఆర్‌ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని అన్నారు. ఆ కంపెనీ గతంలోనే ఒప్పందం కుదుర్చుకుందని, ఆ పెట్టుబడి కొత్తేమి కాదని వెల్లడించారు. స్విట్జర్లాండ్‌కు స్టాడ్లర్ కంపెనీ గతంలోనే మేధా సర్వో కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుందని గుర్తు చేశారు. ఆ కంపెనీ ప్రతినిధులు ఢిల్లీకి వచ్చారని, హైదరాబాద్‌కూ వచ్చారని, తనను వ్యక్తిగతంగానూ కలిశారని తెలిపారు. తెలంగాణకు తాము ఎప్పుడూ అండగా ఉంటామని కాని తప్పుడు ప్రచారం చేయవద్దని టీఆర్‌ఎస్‌ను కోరారు.
తెలంగాణలో తప్పకుండా మార్పు వస్తుందని మరోమారు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులని, వారు అన్నీ గమనిస్తున్నారని తెలిపారు. రూ.వందల కోట్లు ఖర్చు చేసినా.. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ప్రజలు అనుకున్న వారికే ఓట్లు వేశారు. ఎతమ పార్టీలో మూడేళ్లకోసారి అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుందన్నారు. రెండు దఫాల కంటే అధ్యక్షుడిగా ఎవరూ కొనసాగరని ఆయన చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే CM పదవిని దళితులకు ఇస్తారా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.
బీజేపీ జాతీయ పార్టీ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నిక అవుతారో తాము చెప్పలేమన్నారు. JP నడ్డా కుటుంబసభ్యులు ఈ పదవిని చేపట్టరని ఆయన తేల్చి చెప్పారు. ఇలా చెప్పే గుండె ధైర్యం మీకుందు అని టీఆర్ఎస్ ను ప్రశ్నించారు కిషన్ రెడ్డి. మీది ప్రజాస్వామ్య పార్టీయేనా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. సిద్ధాంత పరంగా కుటుంబ రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకం. ప్రధానంగా కుటుంబ పార్టీలను వ్యతిరేకిస్తున్నాం. కుటుంబ పార్టీలు పూర్తిగా దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయి. ఈ కుటుంబ పార్టీల కారణంగా దేశంలో అవినీతి పెరిగిపోయిందని మండిపడ్డారు. మాపై టీఆర్‌ఎస్ ఎంత విషం చిమ్మినా.. ఆ పార్టీకి ప్రజలు ఓట్లు వేయరు. మాది ప్రజాస్వామ్య పార్టీ. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న పార్టీ బీజేపీ అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.