మంచి మనసున్న గవర్నర్‌గా తమిళిసై.. పేద విద్యార్థికి ల్యాప్‌టాప్‌ సాయం.. గవర్నర్‌కు విద్యార్థి కృతజ్ఞతలు

ఓ పేద విద్యార్థి పెట్టుకున్న అప్లికేషన్‌పై వెంటనే స్పందించారు తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌. నిరుపేదలకు సాయం చేయడంలో ఎప్పుడూ ముందుండే..

మంచి మనసున్న గవర్నర్‌గా తమిళిసై.. పేద విద్యార్థికి ల్యాప్‌టాప్‌ సాయం.. గవర్నర్‌కు విద్యార్థి కృతజ్ఞతలు
Ts Governor
Follow us
K Sammaiah

|

Updated on: Mar 16, 2021 | 11:14 AM

ఓ పేద విద్యార్థి పెట్టుకున్న అప్లికేషన్‌పై వెంటనే స్పందించారు తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌. నిరుపేదలకు సాయం చేయడంలో ఎప్పుడూ ముందుండే గవర్నర్‌ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఆన్ ‌లైన్‌ లో తన ఉన్నత చదువులకు ల్యాప్‌టాప్‌ అవసరమని సోషల్‌ మీడియాలో సాయం కోరిన డిఫార్మసీ విద్యార్ధి అభ్యర్థనపై గవర్నర్‌ తమిళిసై స్పందించారు. సదరు విద్యార్ధికి గవర్నర్‌ నిధి నుంచి కొనుగోలుచేసిన ల్యాప్‌టాప్‌ను విద్యార్ధికి అందజేశారు.

రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూర్‌ గ్రామానికి చెందిన విద్యార్ధి బియ్యని ప్రమోద్‌ మొయినాబాద్‌ సమీపంలోని జోగినపల్లి బీఆర్‌ ఫార్మసీ కళాశాలలో ఫార్మ్‌ డి తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిం చే ‘మై గవర్నమెంట్‌ యాప్‌’లో క్విజ్‌ పోటీలలో పాల్గొంటుంటాడు.

కరోనా నేపథ్యంలో ప్రస్తుతం చాలా విద్యాసంస్థలు ఆన్‌లైన్‌ద్వారానే క్లాసులు నిర్వహిస్తున్నవిషయం తెలిసిందే. అయితే తనకు ల్యాప్‌టాప్‌ లేక పోవడం వల్ల ఆన్‌లైన్‌ క్లాసులు వినలేకపోతున్నానని, తనకు ల్యాప్‌టాప్‌ సాయం చేయాలంటూ మెయిల్‌ పంపిస్తూ విజ్ఞప్తిచేశారు. దీనికి స్పందించిన గవర్నర్‌ తమిళిసై ఆ విద్యార్ధిని రాజ్‌భవన్‌కు పిలిపించి మంచి భోజనం పెట్ట, ల్యాప్‌టాప్‌ను అందజేశారు.

ఈసందర్భంగా గవర్నర్‌ తమిళిసై మాట్లాడుతూ… ఉన్నత చదువులు చదవాలనుకుంటున్న విద్యార్ధి తను ఎంచుకున్న రంగంలో మరింత ముందుకు పోయి మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో నువ్వుకూడా పేదలకు సహాయం చేయాలని విద్యార్థికి సూచించారు. సమాజానికి ఏదైనా తిరిగి ఇవ్వాలని సూచించారు. తాను ఓ చిన్నరైతు కుటుంబానికిచెందిన వాడినని, తనకు ల్యాప్‌టాప్‌కొనే స్థోమత లేదని విద్యార్ధి ప్రమోద్‌ ఈసందర్భగా తెలిపారు. గవర్నర్‌ ఎంతో దయతలచి తనకు చేసిన సాయం మరువలేనని చెప్పారు. గవర్నర్‌ సూచంచినట్లు భవిష్యత్‌లో తానూ సేవాదృక్పధంతో జీవిస్తానని ప్రమోద్‌ తెలిపారు. నిరుపేద విద్యార్థికి గవర్నర్‌ సాయం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read More:

భలా బండలనాగపూర్‌.. ఆభివృద్ధిలో ఆదర్శంగా నిలిచిన కుగ్రామం.. వెతుక్కుంటూ వచ్చిన అవార్డులు

ప్రైవేటు క్లినిక్‌లు నడుపుకుంటూ తమాషాలు చేస్తున్నారా..? వైద్యులపై మంత్రి చెడుగుడు.. డాక్టర్ల గుస్సా