TRS mla Ramulu naik Clarification : తప్పు తప్పు.. నేను అలా మాట్లాడలే.., ఎమ్మెల్యే రాములు నాయక్ క్లారిఫికేషన్

TRS mla Ramulu naik Clarification :  ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బులు పంపిణీ చేయాలని కేడర్‌కి సూచించారంటూ వస్తున్న వార్తలపై ఎమ్మెల్యే రాములు నాయక్‌ వివరణ ఇచ్చారు. సోషల్‌ మీడియాలో..

TRS mla Ramulu naik Clarification : తప్పు తప్పు..  నేను అలా మాట్లాడలే.., ఎమ్మెల్యే రాములు నాయక్ క్లారిఫికేషన్
Ramulu Naik

Updated on: Mar 13, 2021 | 7:08 PM

TRS mla Ramulu naik Clarification :  ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బులు పంపిణీ చేయాలని కేడర్‌కి సూచించారంటూ వస్తున్న వార్తలపై ఎమ్మెల్యే రాములు నాయక్‌ వివరణ ఇచ్చారు. సోషల్‌ మీడియాలో వస్తున్న తన వార్తలను కావాలనే కొందరు వక్రీకరించారని ఆయన అన్నారు. ఎన్నికల కోడ్‌ను తానూ ఎక్కడా ఉల్లంఘించలేదన్నారు. కార్యకర్తలను ఉత్సాహపరించేందుకే తాను మాట్లాడనని రాములు నాయక్‌ అన్నారు. ఇలాఉండగా, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బులు పంచాలని ఎమ్మెల్యే రాములునాయక్‌ చేసిన వ్యాఖ్యలపై సీఎల్పీ నేత బట్టి విక్రమార్క తీవ్రఅసహనం వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ ఏం చేస్తోందని ఆయన ప్రశ్నించారు.

ఎమ్మెల్యే లు,మంత్రులు బాహాటంగా ఓటర్లకు డబ్బులు పంచాలని కామెంట్‌ చేసినా..ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. ఎన్నికల్లో గెలవడానికి టీఆర్‌ఎస్‌ నేతలు చేస్తున్న అక్రమాలను ఎందుకు అడ్డుకోవడంలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ ఓటమి భయంతోనే ఓటర్లకు డబ్బులు పంపిణీ చేయాలని చూస్తోందని ఆయన ఎద్దేవా చేశారు.

Read also : MLA Ramulu Naik : ‘అవసర మైతే డబ్బులివ్వండి. ఇదంతా ఆఫ్‌ ది రికార్డ్‌, డోన్ట్‌ వర్రీ, నే చూసుకుంటా. కానీ.. మనమే గెలవాలి’