Jagga Reddy: అన్నా.. కాంగ్రెస్ వీడొద్దు.. వీహెచ్ ఎదుట జగ్గారెడ్డి కాళ్లు పట్టుకుని బ్రతిమాలిన పీసీసీ నేత

|

Feb 19, 2022 | 12:57 PM

తెలంగాణ కాంగ్రెస్‌లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. పార్టీ రాష్ట్ర నాయకత్వంపై ఆసంతృప్తితో ఉన్న సంగారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పార్టీ వీడేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఆయనను బుజ్జగించేందుకు సీనియర్ నేతలు రంగంలోకి దిగారు.

Jagga Reddy: అన్నా.. కాంగ్రెస్ వీడొద్దు.. వీహెచ్ ఎదుట జగ్గారెడ్డి కాళ్లు పట్టుకుని బ్రతిమాలిన పీసీసీ నేత
Jagga Reddy Vh
Follow us on

Sangareddy MLA Jagga Reddy: తెలంగాణ(Telangana) కాంగ్రెస్‌(Congress)లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. పార్టీ రాష్ట్ర నాయకత్వంపై ఆసంతృప్తితో ఉన్న సంగారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పార్టీ వీడేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఆయనను బుజ్జగించేందుకు సీనియర్ నేతలు రంగంలోకి దిగారు. జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నారన్న ప్రచారం జరగడంతో మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తదితరుల ఫోన్ ఆరా తీశారు. మాజీ ఎంపీ వి.హనుమంతరావు ఏకంగా ఇంటికి వెళ్లి బుజ్జగింపులు ప్రారంభించారు. ఏదైనా సమస్య ఉంటే పార్టీ హైకమాండ్‌కు ఫిర్యాదు చేయాలని, పార్టీ వ్యవహారాలను బజారుకు లాగొద్దని సూచించినట్లు సమాచారం. పార్టీకి మాత్రం రాజీనామా చేయవద్దని కోరినట్లు తెలుస్తోంది.

అయితే, తనపై పార్టీలోని వారే కుట్రలు చేస్తున్నారని.. తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని నిన్న మీడియా సమావేశంలో తెలిపారు. తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేస్తూ రాజీనామాను పార్టీ అధిష్టానానికి పంపిస్తానన్నారు. ఈ క్రమంలోనే జగ్గారెడ్డిని పార్టీ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు కలశారు. కాంగ్రెస్‌ను వీడొద్దని విజ్ఞప్తి చేశారు. పార్టీలోనే ఉంటూ అన్యాయాలపై పోరాడాలని సూచించారు. ఈక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లి కిషన్ ఏకంగా జగ్గారెడ్డి కాళ్లు పట్టుకుని కాంగ్రెస్ ను విడిచిపెట్టొద్దని ప్రాధాయపడ్డారు. తనపై, జగ్గారెడ్డిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయడం బాధగా ఉందని వీహెచ్ ధ్వజమెత్తారు. తమ ఫొటోలను మార్ఫింగ్ చేసి తాము టీఆర్ఎస్‌లో చేరుతున్నట్టు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌కు వెళ్లారు.

ఇదిలావుంటే, గత కొంతకాలంగా రేవంత్ రెడ్డి అనుచరులు సోషల్ మీడియాలో తనను టీఆర్ఎస్ కోవర్టుగా చిత్రీకరిస్తుండటంపై జగ్గారెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో శనివారం జగ్గారెడ్డి ముఖ్య అనుచరులతో సమావేశమై కఠిన నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. దీంతో ఆయన పార్టీకి రాజీనామా చేస్తారన్న ప్రచారం జరిగింది. అయితే కాంగ్రెస్ నేతలు బుజ్జగించడంతో జగ్గారెడ్డి మెత్తబడినట్లు తెలిసింది. త్వరలో సోనియా, రాహుల్ ను కలసి తనపై జరుగుతున్న ప్రచారంపై జగ్గారెడ్డి ఫిర్యాదు చేస్తానని చెప్పినట్లు తెలిసింది.

Read Also…. Viral Video: బండిని రివర్స్ చేశాడు.. సీన్ కాస్తా రివర్స్ అయింది.. వీడియో చూస్తే షాకే.!