హుజూరాబాద్‌లో నామినేషన్ రాజకీయం వేడెక్కింది. నామినేషన్లకు మూడు రోజులే మిగిలి ఉంది. దీంతో నామినేషన్లు వేసేందుకు పెద్ద ఎత్తున ఫీల్డ్ అసిస్టెంట్లు తరలివచ్చారు. రిటర్నింగ్ అధికారి కార్యాలయం ముందు లైన్ కట్టారు. అయితే కోవిడ్ నిబంధనలు, వ్యాక్సిన్ సర్టిఫికెట్ కావాలి అంటూ అధికారులు రూల్స్ పెట్టారు. నామినేషన్ వేయడానికి రూల్స్ అడ్డుపడుతున్నాయి. దీంతో హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ఫీల్డ్ అసిస్టెంట్లు నిరసనకు దిగారు. నిబంధనల పేరుతో నామినేషన్ వేయనివ్వడం లేదని ఆందోళన చేపట్టారు.
దాదాపు 150 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఇవాళ నామినేషన్ వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నెల 8 వరకు నామినేషన్ల స్వీకరణకు తుది గడువు కాగా.. 13 వరకూ ఉపసంహరణకు గడువు. అక్టోబరు 30న పోలింగ్ జరుగుతుంది. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు.. అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు. జూన్12న ఈటల రాజేందర్ రాజీనామా చేయడంతో హుజూరాబాద్‌లో బైపోల్ జరుగుతోంది. అప్పటి నుంచి ఫుల్ హీట్ మీదున్న ఈ నియోజకవర్గం.. షెడ్యూల్ రిలీజ్‌తో మరింత వేడెక్కబోతోంది.
ఇవి కూడా చదవండి: Converting air to water: కూలర్ ధరకే గాలి నుంచి నీటిని ఉత్పత్తి చేసే మిషన్.. ధర ఎంతో తెలుసా..