ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఎంత మంది పోటీ పడుతున్నారంటే..?

| Edited By:

Mar 29, 2019 | 10:25 AM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి మొత్తం 2వేల 186 మంది పోటీ పడుతున్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత ఫైనల్ లిస్టును ఈసీ విడుదల చేసింది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు 19 వందల 98మంది పురుషులు, 187 మంది మహిళలు పోటీపడుతున్నారు. ఇక 25 లోక్‌సభ స్థానాలకు గాను 320 మంది బరిలో నిలవగా.. వారిలో 25 మంది మహిళలు.. 295 మంది పురుషులు ఉన్నారు. ఒక్కో అసెంబ్లీ స్థానానికి సగటున 12 మంది పోటీపడుతుండగా.. ఒక్కో […]

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఎంత మంది పోటీ పడుతున్నారంటే..?
Follow us on

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి మొత్తం 2వేల 186 మంది పోటీ పడుతున్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత ఫైనల్ లిస్టును ఈసీ విడుదల చేసింది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు 19 వందల 98మంది పురుషులు, 187 మంది మహిళలు పోటీపడుతున్నారు. ఇక 25 లోక్‌సభ స్థానాలకు గాను 320 మంది బరిలో నిలవగా.. వారిలో 25 మంది మహిళలు.. 295 మంది పురుషులు ఉన్నారు. ఒక్కో అసెంబ్లీ స్థానానికి సగటున 12 మంది పోటీపడుతుండగా.. ఒక్కో లోక్‌సభ సీటుకు 13 మంది ఉన్నారు, గుంటూరు జిల్లాలో 32 మంది మహిళలు శాసనసభకు పోటీ చేస్తుండగా.. ప్రకాశం జిల్లాలో అత్యల్పంగా ఐదుగురు మాత్రమే బరిలో ఉన్నారు. అలాగే గుంటూరు జిల్లాలో అత్యధికంగా 321 మంది పోటీలో ఉండగా.. అతి తక్కువగా విజయనగరం జిల్లాలో 74 మందే బరిలో నిలిచారు.