Kotia village: పొలిటికల్ టర్న్ తీసుకుంటున్న సరిహద్దు రచ్చ.. తెర మీదికి ఆలయ నిర్మాణ వివాదం..

|

Jul 12, 2021 | 9:20 AM

కొటియా గ్రామాల్లో ఆలయ నిర్మాణాన్ని అడ్డుకోవటంపై TDP పొలిట్ బ్యూరో సభ్యురాలు గుమ్మడి సంధ్యారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రా ఒడిస్సా వివాదస్పద గ్రామాల పై సోమవారం కలెక్టర్ ను సాలూరు MLA పీడిక రాజన్న దొర..

Kotia village: పొలిటికల్ టర్న్ తీసుకుంటున్న సరిహద్దు రచ్చ.. తెర మీదికి ఆలయ నిర్మాణ వివాదం..
Kotia Village Telugu
Follow us on

ఒడిశా, ఏపీ సరిహద్దు గ్రామాల్లో నెలకొన్న వివాదం పొలిటికల్‌ హీట్‌ పెంచుతోంది. మొన్నటి వరకు తమను ఏపీలో కలపాలంటూ ఒడిశాకు చెందిన 8 గ్రామాల ప్రజలు కోరుతుండగా.. తాజాగా కొటియా గ్రామం.. కాక రేపుతోంది. ఆ గ్రామంలో నిర్మించిన ఆలయం..పై ఎమ్మెల్యే రాజన్న దొర వర్సెస్‌ టీడీపీగా మారింది. కొటియా గ్రామాన్ని ఏపీ, ఒడిశా రాష్ట్రాలు తమ రాష్ట్రానికి చెందిన ఊరుగానే చూస్తున్నప్పటికీ.. ఆ పంచాయతీ మాత్రం తెగడం లేదు. రెండు ప్రభుత్వాలు అక్కడ తమ పనులను కొనసాగిస్తున్నప్పటికీ… తాజాగా కొటియా గ్రామంలో నిర్మించిన ఆలయం.. రాజకీయ దుమారానికి కారణంగా మారింది.

ఈ టెంపుల్‌ నిర్మాణాన్ని అడ్డుకోవాలంటూ సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర డిమాండ్‌ చేస్తున్నారు. ఆ మేరకు స్థానిక తహశీల్దార్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ… నేడు జిల్లా కలెక్టర్‌ను కూడా కలిసి విజ్ఞప్తి చేయబోతున్నారు. దాంతో దుమారం మరింత ముదిరినట్టు అయింది.

అయితే ఎమ్మెల్యే దొర నిర్ణయాన్ని.. టీడీపీ తప్పుపడుతోంది. కొటియా గ్రామంలో బిల్డర్లు పెద్ద ఎత్తున నిర్మాణాలు జరిపినప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడెందుకని నిలదీస్తున్నారు ఆ పార్టీ నేత గుమ్మడి సంధ్యారాణి. ఆలయ నిర్మాణాన్ని మాత్రమే అడ్డుకోవడం వెనుక ఉన్న కారణం ఏంటని నిలదీస్తున్నారు.

ఏపీ, ఒడిశా రాష్ట్రాల మధ్య సాగుతున్న వివాదం ఈనాటిది కాదు. దశాబ్దాలుగా రగులుతూనే ఉంది. మొత్తం 21 గ్రామాలపై పంచాయతీ రగులుతున్నప్పటికీ…. విజయనగరం జిల్లాకు సరిహద్దులో ఉన్న కొటియా గ్రామం మరింత వివాదానికి కేంద్రబిందువుగా మారింది.

ఇవి కూడా చదవండి : Kongu Nadu: ప్రత్యేక రాష్ట్రం దిశగా “కొంగునాడు”.. ప్రణాళికలు సిద్ధం చేస్తున్న కేంద్ర సర్కార్..

కుర్రాళ్ళ గుండెలకు గిలిగింతలు పెడుతున్న బుల్లితెర బ్యూటీ క్వీన్ శ్రీముఖి