బండి సంజయ్‌ వ్యాఖ్యలపై తెలంగాణ ఐపీఎస్‌ అసోసియేషన్‌ గుస్సా.. ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రకటన

|

Mar 18, 2021 | 8:16 AM

ఐపీఎస్ అధికారులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసింది తెలంగాణ ఐపీఎస్ అసోసియేషన్..

బండి సంజయ్‌ వ్యాఖ్యలపై తెలంగాణ ఐపీఎస్‌ అసోసియేషన్‌ గుస్సా.. ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రకటన
Follow us on

ఐపీఎస్ అధికారులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసింది తెలంగాణ ఐపీఎస్ అసోసియేషన్. భైంసా ఘటనలో శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు తీవ్రంగా కృషిచేశారని తన ప్రకటనలో పేర్కొన్న ఐపీఎస్ అధికారుల అసోసియేషన్., బండి సంజయ్ వాఖ్యలను తీవ్రంగా పరిగణించింది.

పోలీసులపై ప్రజలకు నమ్మకం పోయేలా బండి సంజయ్ వాఖ్యనించడం సరికాదంటూ అభ్యంతరం వ్యక్తంచేసింది. శాంతిభద్రతల పరిరక్షణ కోసం పగలు, రాత్రి తేడాలేకుండా కష్టపడుతున్నాం, కోవిడ్ సమయంలోనూ పోలీసులు కీలక పాత్ర పోషించారని, కానీ, పోలీసులపై బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తన ప్రకటనలో పేర్కొంది తెలంగాణ ఐపీఎస్ అసోసియేషన్.

అంతకు మందు పోలీసులపై బండి సంజయ్‌ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. భైంసాలో అత్యాచార బాధితురాలి కుటుంబాన్ని పోలీసులు బెదిరించారాని ఆరోపించారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భైంసా అత్యాచార మైనర్‌ బాధితురాలిని బండి సంజయ్‌ పరామర్శించారు. విషయం బయటికి చెప్పొద్దని పోలీసులు బాధితురాలి కుటుంబాన్ని బెదిరించారని, ప్రతి విషయాన్ని పోలీసులు మతాన్ని తెరపైకి తెస్తున్నారని ఆరోపించారు. చిన్నారిపై అత్యాచారం జరిగితే పోలీసులు వెంటనే స్పందించలేదని, కనీసం కాపాడే ప్రయత్నం చేయలేదని విమర్శించారు.

హిందూ వాహిని కార్యకర్తలను వేధించిన పోలీసులను వదిలిపెట్టమని బండి సంజయ్‌ హెచ్చరించారు. పోలీసుల తీరుపై జ్యూడిషియల్‌ ఎంక్వైరీ వేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. భైంసాలో చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన యువకుడిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తలను వేధిస్తున్న ఐపీఎస్‌ అదికారుల వెంట పడతామని సంజయ్‌ హెచ్చరించారు. పోలీసులు కొందరు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సీఐ స్థాయి అధికారులు మాత్రం తమ విధులను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని చెప్పారు.

అయితే బండి సంజయ్‌ ఆరోపణలను తెలంగాణ ఐపీఎస్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. భైంసా ఘటనలో శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు తీవ్రంగా కృషిచేశారని అసోసియేషన్‌ ప్రకటించింది. పోలీసులకు పార్టీలు.. కులాలు, మతాలు ఉండవని తెలిపింది. శాంతిభద్రతలను కాపాడడమే లక్ష్యంగా పోలీసులు పని చేస్తారని అసోసియేషన్‌ పునరుద్ఘాటించింది

Read More:

భైంసాలో జరిగింది అమానుష ఘటన.. ప్రభుత్వం నిద్రపోతుందా..? ఆ నిందితులను కఠినంగా శిక్షించాలి-షర్మిల

సీఎం కేసీఆర్‌ వర్సెస్‌ భట్టి.. వ్యవసాయ చట్టాలపై భట్టి ఆరోపణలను తిప్పి కొట్టిన కేసీఆర్