Nominated Posts: నామినేటెడ్ పదవుల కోసం ఆశావాహుల ఎదురుచూపులు.. సీఎం రేవంత్‌ ప్రసన్నం చేసుకునే పనిలో లీడర్లు

రాష్ట్రంలో కొత్త సర్కార్ కొలువు దీరింది.. పదేళ్లుగా పదవుల కోసం ఎదురుచూస్తున్న కాంగ్రెస్ నేతలు ఇక నామినేటెడ్ పోస్టుల కోసం పరుగులు మొదలు పెట్టారు. గత బీఆర్ఎస్ సర్కార్‌లో కార్పోరేషన్ చైర్మన్లుగా అత్యధికంగా ఓరుగల్లు వాసులు దక్కించుకోగా, ఇదే తరహాలో రేవంత్ రెడ్డి సర్కార్ లోనూ వరంగల్‌కు ప్రాధాన్యత ఉంటుందని ఆరాటపడుతున్నారు.

Nominated Posts: నామినేటెడ్ పదవుల కోసం ఆశావాహుల ఎదురుచూపులు.. సీఎం రేవంత్‌ ప్రసన్నం చేసుకునే పనిలో లీడర్లు
Telangana Congress
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Dec 13, 2023 | 3:33 PM

రాష్ట్రంలో కొత్త సర్కార్ కొలువు దీరింది.. పదేళ్లుగా పదవుల కోసం ఎదురుచూస్తున్న కాంగ్రెస్ నేతలు ఇక నామినేటెడ్ పోస్టుల కోసం పరుగులు మొదలు పెట్టారు. గత బీఆర్ఎస్ సర్కార్‌లో కార్పోరేషన్ చైర్మన్లుగా అత్యధికంగా ఓరుగల్లు వాసులు దక్కించుకోగా, ఇదే తరహాలో రేవంత్ రెడ్డి సర్కార్ లోనూ వరంగల్‌కు ప్రాధాన్యత ఉంటుందని ఆరాటపడుతున్నారు. లోకల్ ఎమ్మెల్యేలు, మంత్రులతో పాటు, రాష్ట్రస్థాయిలో తమకున్న పరిచాయాలతో ఆశావాహులు తెగ పావులు కదుపుతున్నారు…

రాష్ట్ర రాజకీయాల్లో ఓరుగల్లుకు ఎప్పుడూ ప్రత్యేక స్థానమే.. ఉమ్మడి రాష్ట్రం నుంచి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వరకూ ఇదే సీన్ కొనసాగుతూ వస్తోంది. ఉద్యమాల నుంచి రాజకీయాల వరకూ ఇక్కడ నేతలు రాష్ర్ట రాజకీయాల్లో కీ రోల్ గా మారుతున్నారు. తమకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారు. మొన్నటి సాధారణ ఎన్నికల్లోనూ వరంగల్ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ ప్రత్యేక మార్క్ సాధించింది.. 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు 10 స్థానాలను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కైవసం చేసుకున్నారు.

రేవంత్ రెడ్డి మంత్రి వర్గంలో ఇద్దరు మహిళా మంత్రులు ఉంటే ఆ ఇద్దరు ఓరుగల్లు ఆడబిడ్డలే కావడం విశేషం. వారికి కీలకమైన శాఖలు దక్కాయి. ఇదే తరహా కార్పొరేషన్ చైర్మన్ పోస్టులు దక్కుతాయని వరంగల్ కు చెందిన కాంగ్రెస్ లీడర్లు తెగ ఆరాటడుతున్నారు. మొన్నటి ఎన్నికల్లో టికెట్ దక్కని నేతలు, పోటీ చేసిన అభ్యర్థుల గెలుపులో కీలకంగా వ్యవహరించిన నేతలు, సీనియర్ కాంగ్రెస్ నేతలు ఒక్క ఛాన్స్ అంటున్నారు. ఎన్నో ఏళ్లుగా పార్టీకి సేవలందిస్తున్న లీడర్లు ఇప్పుడు తమ పార్టీ అధికారంలోకి రావడంతో ఇక పదవుల కోసం పరుగులు పెడుడుతున్నారు.

బీఆర్ఎస్ సర్కార్ లో ఎక్కువ మంది వరంగల్ నుంచి వివిధ కార్పోరేషన్ చైర్మన్ పదవులు దక్కాయి.. రాష్ట్ర వికలాంగుల చైర్మన్ గా కే.యూ విద్యార్థి నేత వాసుదేవ రెడ్డి బాధ్యతలు నిర్వహించారు. రాష్ట్ర రైతు బంధు సమితి చైర్మన్‌గా డాక్టర్ తాడికొండ రాజయ్య, హస్తకలల అభివృద్ది సంస్థ చైర్మన్ గా బొల్లం సంపత్ కుమార్, తెలంగాణ వాటర్ రిసోర్స్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్ వి. ప్రకాశ్ రావు, రాష్ట్ర రైతు రుణ విముక్తి కార్పోరేషన్ చైర్మన్ గా నాగుర్ల వెంకటేశ్వర్లు, రాష్ట్ర రహదారుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా మెట్టు శ్రీనివాస్‌, ఆర్టీసీ చైర్మన్ గా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, తెలంగాణ రాష్ట్ర విద్య – సంక్షేమ, మౌలికవసతుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా రావుల శ్రీధర్‌రెడ్డి కొనసాగారు.

వీరందరి పదవులను రాష్ట్ర ప్రభుత్వం రద్దుచేసింది.. కేబినెట్ హోదా కలిగిన పదవుల తో పాటు కుడా చైర్మన్, జిల్లా స్థాయి కార్పోరేషన్లు,మార్కెట్ కమిటీలు, దేవాలయాల కమిటీలు…అనేక ఉన్నాయి. రాష్ట్ర స్థాయి కేబినెట్ హోదా కలిపి కార్పోరేషన్ చైర్మన్ పదవుల కోసం ఇప్పుడు కాంగ్రెస్ లీడర్లు అనేక మంది పోటీ పడుతున్నారు.. వివిధ సమీకరణలతో ఒక్క ఛాన్స్ అంటున్నారు

పార్టీకోసం శ్రమించిన వారు వేట ముమ్మరం చేశారు. వారిలో OC, BC, SC, ST సమీకరణలతో ప్రయత్నాలు ముమ్మరం చేశారు.. అలాంటి వారిలో మాజీ MLA వేం నరేందర్ రెడ్డి, మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ MLC రేసులో ఉన్నారు. సీనియర్ నాయకుడు EV శ్రీనివాస్, బట్టి శ్రీనివాస్, అజీజ్ ఖాన్, ఇనగాల వెంకట్రామిరెడ్డి, నిమిoడ్ల శ్రీనివాస్, పైడాకుల అశోక్, బాదం ప్రవీణ్, మీసాల ప్రకాశ్, నల్గొండ రమేష్, జంగా రాఘవరెడ్డి, భరత్ చంద్రరాడెడ్డి, అనిమిరెడ్డి కృష్ణారెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లీస్టే తయారవుతుంది…

ఇప్పటికే ప్రభుత్వం నామినేటెడ్ పోస్టుల పై దృష్టిపెట్టింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో నియమించిన 54 కార్పోషన్ చైర్మన్లను తొలిగించింది. దీంతో ఆశావాహులు తమ ప్రయత్నాలను మరింత ముమ్మరం చేశారు. రేవంత్ రెడ్డి సర్కార్ లోనూ వరంగల్ కు నామినేటేడ్ పోస్టుల్లో పెద్దపీట వేస్తారా..? .వరంగల్ జిల్లా వాసులకు ఎంత మందికి పోస్టులు దక్కుతాయే తెలియాలంటే మరికొంత కాలం వేచి ఉండాల్సిందే..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Weekly Horoscope: ఆ రాశికి చెందిన నిరుద్యోగులకు ఉద్యోగ ఆఫర్లు..
Weekly Horoscope: ఆ రాశికి చెందిన నిరుద్యోగులకు ఉద్యోగ ఆఫర్లు..
ప్రారంభమైన ఆర్‌ఎస్‌ఎస్‌ సమావేశం.. ఆ అంశాలపైనే చర్చ!
ప్రారంభమైన ఆర్‌ఎస్‌ఎస్‌ సమావేశం.. ఆ అంశాలపైనే చర్చ!
ప్రైవేట్ జెట్‌లో షిర్డీ వెళ్లిన దళపతి విజయ్.. కారణమిదే
ప్రైవేట్ జెట్‌లో షిర్డీ వెళ్లిన దళపతి విజయ్.. కారణమిదే
తగ్గేదేలే.. ఢిల్లీలో ఎమర్జెన్సీ సినిమా పాటలు రిలీజ్ చేసిన కంగనా
తగ్గేదేలే.. ఢిల్లీలో ఎమర్జెన్సీ సినిమా పాటలు రిలీజ్ చేసిన కంగనా
ఇక్కడ మీ ఇల్లు ఉంటే అధికారులు వచ్చేస్తారు..!
ఇక్కడ మీ ఇల్లు ఉంటే అధికారులు వచ్చేస్తారు..!
మంగళూరు స్టైల్ చేపల కూర.. తిన్నారంటే మళ్లీ ఇలాగే చేయమంటారు..
మంగళూరు స్టైల్ చేపల కూర.. తిన్నారంటే మళ్లీ ఇలాగే చేయమంటారు..
రెస్టారెంట్ స్టైల్ వెజ్ కూర్మ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
రెస్టారెంట్ స్టైల్ వెజ్ కూర్మ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
చిన్న పిల్లలకు ఎంతో ఇష్టమైన బెల్లం బిస్కెట్లు.. ఈజీగా చేసేయవచ్చు.
చిన్న పిల్లలకు ఎంతో ఇష్టమైన బెల్లం బిస్కెట్లు.. ఈజీగా చేసేయవచ్చు.
పుష్ప 2 సినిమాకు కళ్లు చెదిరే ఓటీటీ డీల్.. అన్ని వందల కోట్లా?
పుష్ప 2 సినిమాకు కళ్లు చెదిరే ఓటీటీ డీల్.. అన్ని వందల కోట్లా?
వీడెవడో బుమ్రానే మించిపోయాడుగా.. 4 ఓవర్లకు ఎన్ని పరుగులిచ్చాడో!
వీడెవడో బుమ్రానే మించిపోయాడుగా.. 4 ఓవర్లకు ఎన్ని పరుగులిచ్చాడో!
హైడ్రా అంటె భయమా.. మీ ఇంటిని ఎక్కడికైనా తరలించండి| భూలోకంలో యముడు
హైడ్రా అంటె భయమా.. మీ ఇంటిని ఎక్కడికైనా తరలించండి| భూలోకంలో యముడు
చిన్న వయసులోనే చర్మం ముడతలు పడుతోందా.? అయితే ఇలా చెయ్యండి..
చిన్న వయసులోనే చర్మం ముడతలు పడుతోందా.? అయితే ఇలా చెయ్యండి..
పక్కపక్కనే భారత్‌, చైనా యుద్ధ నౌకలు.! శ్రీలంక తీరంలో పరిణామం.
పక్కపక్కనే భారత్‌, చైనా యుద్ధ నౌకలు.! శ్రీలంక తీరంలో పరిణామం.
రుణమాఫీ కాని రైతుల కోసం ప్రత్యేక యాప్.. ఎలా అప్లై చేయాలంటే.!
రుణమాఫీ కాని రైతుల కోసం ప్రత్యేక యాప్.. ఎలా అప్లై చేయాలంటే.!
గృహజ్యోతి లబ్దిదారులకు షాకింగ్‌ న్యూస్‌.! పెండింగ్‌ బిల్స్..
గృహజ్యోతి లబ్దిదారులకు షాకింగ్‌ న్యూస్‌.! పెండింగ్‌ బిల్స్..
విజయవాడ చరిత్రలోనే భయానకమైన వర్షం.! చూస్తే బెదిరేలా దృశ్యాలు..
విజయవాడ చరిత్రలోనే భయానకమైన వర్షం.! చూస్తే బెదిరేలా దృశ్యాలు..
కన్నతల్లిని భారంగా భావించిన కొడుకులు.. ఆ తల్లి ఏం చేసిందో తెలుసా?
కన్నతల్లిని భారంగా భావించిన కొడుకులు.. ఆ తల్లి ఏం చేసిందో తెలుసా?
మరో దారుణం.. నర్సింగ్‌ విద్యార్థినిపై ఆటో డ్రైవర్‌ అఘాయిత్యం.!
మరో దారుణం.. నర్సింగ్‌ విద్యార్థినిపై ఆటో డ్రైవర్‌ అఘాయిత్యం.!
కూరగాయలు ఫ్రీ.. ఎక్కడంటే.! ఒక్కసారిగా ఎగబడ్డ జనం.
కూరగాయలు ఫ్రీ.. ఎక్కడంటే.! ఒక్కసారిగా ఎగబడ్డ జనం.
రైలు పట్టాలపై గొడుగు వేసుకొని మరీ నిద్రపోయిన వ్యక్తి. చూస్తే షాక్
రైలు పట్టాలపై గొడుగు వేసుకొని మరీ నిద్రపోయిన వ్యక్తి. చూస్తే షాక్