సాగర్‌లోని కాషాయ బల్బుకు ఆదిలాబాద్ లో స్విచ్ ఆన్ చేశారు. కట్ చేస్తే, కాంగ్రెస్‌కు బై.. బై.. చెప్పేసిన ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేశ్‌ రాథోడ్‌

కాంగ్రెస్‌కు మరో షాక్‌ తగిలింది. ఆదిలాబాద్‌కు చెందిన మాజీ ఎంపీ రమేశ్‌ రాథోడ్‌ కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పేశారు. షోకాజు నోటీసులు ఇవ్వకుండా సస్పెండ్‌..

సాగర్‌లోని కాషాయ బల్బుకు ఆదిలాబాద్ లో స్విచ్ ఆన్ చేశారు. కట్ చేస్తే,  కాంగ్రెస్‌కు బై.. బై.. చెప్పేసిన ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేశ్‌ రాథోడ్‌
Follow us

|

Updated on: Feb 28, 2021 | 6:30 PM

Ramesh Rathod : కాంగ్రెస్‌కు మరో షాక్‌ తగిలింది. ఆదిలాబాద్‌కు చెందిన మాజీ ఎంపీ రమేశ్‌ రాథోడ్‌ కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పేశారు. షోకాజు నోటీసులు ఇవ్వకుండా సస్పెండ్‌ చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. త్వరలోనే తన రాజకీయ భవిష్యత్‌ను ప్రకటిస్తానన్నారు. అటు, రమేశ్‌ రాథోడ్‌ బీజేపీలో చేరతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే ఆ మేరకు బీజేపీలోకి గ్రౌండ్‌ ఎంట్రీకోసం రంగం చేసుకున్నట్టు జిల్లాలో టాక్‌ వినిపిస్తోంది. త్వరలోనే అనుచరులు, కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశమై నిర్ణయాన్ని ప్రకటిస్తారని తెలుస్తోంది.

ఇలాఉంటే, నాగార్జున సాగర్ ఉపఎన్నికకు ముందు కాంగ్రెస్‌కు షాక్ ఇవ్వడంలో భాగంగానే ఈ వ్యూహరచన జరగిందన్నది పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. సాగర్ పోరులో కీలకమైన ఎస్టీ ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకునేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. సాగర్‌లో ఓటింగ్ అనే బల్బు ఉంటే.. బీజేపీ ఆదిలాబాద్‌లో స్విచ్ఛ్ వేస్తుండటం గమనార్హం. కాంగ్రెస్ మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్‌ను పార్టీలో చేర్చుకునే దిశగా ఎప్పటి నుంచో పావులు కదుపుతోన్న కాషాయ దళం నెమ్మదిగా వర్కౌట్ చేసింది. ఆదివాసీలు, లంబాడీలతో సత్సంబంధాలున్న రమేష్ రాథోడ్ సైతం బీజేపీలో చేరేందుకు సుముఖంగా ఉండటంతో బీజేపీ పెద్దల పని ఈజీ అయింది.

Read also : తెలంగాణలోని సైన్యాన్ని రాజకీయ కదనరంగంలోకి మళ్లిస్తున్నాడు, షర్మిల కొత్త పార్టీ వేళ, సేన విస్తరణకు సై అంటున్నాడు.. ఏమిటి అంతరార్థం.?