Vijayashanthi : భావితరాలకు సర్కారు భూమి అన్నదే లేకుండా చేసి.. రాష్ట్రాన్ని ప్రయివేటీకరించే కుట్ర ఇది : విజయశాంతి

|

Jun 18, 2021 | 6:22 PM

కేసీఆర్ సర్కారు అవలంభిస్తోన్న విధానాలపై తెలంగాణ బీజేపీ మహిళా నేత, మాజీ ఎంపీ విజయశాంతి మరోసారి మండిపడ్డారు. ప్రభుత్వ భూముల అమ్మకం, ఉన్నత విద్యావ్యవస్థ తీరు తెన్నులు..

Vijayashanthi : భావితరాలకు సర్కారు భూమి అన్నదే లేకుండా చేసి.. రాష్ట్రాన్ని ప్రయివేటీకరించే కుట్ర ఇది : విజయశాంతి
Vijayashanthi
Follow us on

Land auction in Greater Hyderabad : కేసీఆర్ సర్కారు అవలంభిస్తోన్న విధానాలపై తెలంగాణ బీజేపీ మహిళా నేత, మాజీ ఎంపీ విజయశాంతి మరోసారి మండిపడ్డారు. ప్రభుత్వ భూముల అమ్మకం, ఉన్నత విద్యావ్యవస్థ తీరు తెన్నులు తదితర అంశాలపై తెలంగాణ ప్రభుత్వంపై ఆమె తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారంటూ ఆమె విమర్శించారు. పలు వరుస ట్వీట్టలో ఆమె ప్రశ్నలు సంధించారు. “తెలంగాణలో కీలక వ్యవస్థలు ఎంత దారుణంగా కుప్పకూలాయో అర్థం కావాలంటే నేటి పత్రికల్లో వచ్చిన కథనాల్ని గమనిస్తే చాలు. రాష్ట్రంలో భూములమ్మి ఎలాగేనా వేల కోట్ల రూపాయలు ఆదాయాన్ని సమకూర్చుకోవడం లక్ష్యంగా ఆగమేఘాల మీద రాష్ట్ర ప్రభుత్వం ఉరుకులు పరుగులు పెడుతోంది.” అని విజయశాంతి అన్నారు.

“ఈ సర్కారు ఉన్నత విద్యారంగాన్ని ఎంతగా దిగజార్చిందో అర్థం చేసుకోవచ్చు. సుమారు 1000 పైచిలుకు ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నాలుగేళ్ళ కిందటే నిర్ణయం తీసుకుని కూడా భర్తీ చెయ్యలేదు. వ్యవస్థల్ని భ్రష్టు పట్టిస్తున్న ఈ తెలంగాణ సర్కారు కుప్పకూలితే గాని మంచి రోజులు రావు.” అంటూ మరో ట్వీట్లో ఫ్రొఫెసర్ల నియామకాలపై నినదించారు. “ఈ విషయమై రాష్ట్ర సర్కారుకు స్వయంగా గవర్నరే ఘాటుగా లేఖ రాసే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు తెరపైకి వచ్చిన మరో అంశం ఈ వర్శిటీలను తీవ్రంగా వేధిస్తున్న ప్రొఫెసర్ల కొరత. దాదాపు 3 వంతుల పోస్టులు (2,152) ఖాళీగా ఉన్నాయంటే విద్యా వ్యవస్థను…” ఎలా భ్రష్టుపట్టిస్తున్నారో అర్థమవుతుందంటూ విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు.

“ధనిక రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన కేసీఆర్ గారు, నేడు భావితరాల ప్రయోజనాల కోసం రాష్ట్రంలో సర్కారు భూమి అన్నదే లేకుండా చేసేందుకు కుట్ర చేస్తున్నారు. అత్యంత కీలకమైన భూములను పెద్ద మొత్తంలో అమ్మేసి రాష్ట్రాన్ని ప్రయివేటీకరించడమే…తెలంగాణ సర్కారు లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ భూముల అమ్మకాలపై మంత్రి హరీష్‌రావు గారు ఈ మధ్య స్పందిస్తూ… గత ప్రభుత్వాలు భూములమ్మగా లేంది… మేం చేస్తే తప్పా? అని అడిగారు. ఆ సర్కార్లు చేసిన తప్పును ఆనాడు అన్ని వర్గాలూ ఎండగట్టాయి.” అని విజయశాంతి విమర్శలు గుప్పించారు.

Read also : KTR : గృహ ప్రవేశాల ముహూర్తాలు ఖరారు : ఇక గ్రేటర్ హైదరాబాద్ లో అంబరాన్నంటనున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల ప్రారంభోత్సవ సంబరాలు