AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrababu: జనసేనతో పొత్తుపై చంద్రబాబు క్రేజీ కామెంట్స్… లవ్ వన్ సైడ్ కాదంటూ…

వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయా..? ఎన్నికలకు చాలా సమయం ఉంది కదా.. ఇప్పుడెందుకు ఆ డౌట్ అనుకుంటున్నారా..?

Chandrababu: జనసేనతో పొత్తుపై చంద్రబాబు క్రేజీ కామెంట్స్... లవ్ వన్ సైడ్ కాదంటూ...
chandrababu Naidu,Pawan Kalyan
Ram Naramaneni
|

Updated on: Jan 06, 2022 | 8:20 PM

Share

వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయా..? ఎన్నికలకు చాలా సమయం ఉంది కదా.. ఇప్పుడెందుకు ఆ డౌట్ అనుకుంటున్నారా..?. మేము కాదండీ బాబు టీడీపీ కార్యకర్తలే జనసేనతో పొత్తు కావాలని కోరుకుంటున్నారు. కోరుకోవడం మాత్రమే కాదు.. ఏకంగా పార్టీ అధినేత చంద్రబాబును డైరెక్ట్‌గా కోరారు. అయితే చంద్రబాబు నుంచి ఊహించని సమాధానం వచ్చింది. ‘లవ్ వన్ సైడ్ కాదు.. రెండు వైపులు ఉండాలి’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఏకపక్ష లవ్ సరికాదని చంద్రబాబు చమత్కరించారు. టీడీపీ అధినేత కుప్పం పర్యటన సందర్భంగా ఈ ఇంట్రస్టింగ్ సీన్ కనిపించింది.

మూడ్రోజుల కుప్పం పర్యటనకు వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు.. తొలిరోజు బిజీబిజీగా గడిపారు. అధినేతకు ఘనంగా స్వాగతం పలికాయి టీడీపీ శ్రేణులు. రోడ్‌షోలతో దారి పొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు చంద్రబాబు. రామకుప్పం మండలం రామకుప్పం మండలం అరిమానుపెంటలో రచ్చబండ నిర్వహించిన చంద్రబాబు… గ్రామస్తులు, టీడీపీ కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహించారు.

కుప్పం పర్యటనలో సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు ఎక్కు పెట్టారు చంద్రబాబు. సొంత తల్లిని, చెల్లిని కూడా.. జగన్‌ రాజకీయంగా వాడుకుని వదిలేశాడని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టును 71 శాతం టీడీపీ హయాంలోనే పూర్తి చేశామని చెప్పారు చంద్రబాబు. ఆ పనుల్ని కూడా తామే చేశామనీ.. వైసీపీ నేతలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు.

మూడేళ్ల పాలనలో జగన్మోహన్‌ రెడ్డి మూడు ఇళ్లు కూడా నిర్మించలేదని విమర్శించారు చంద్రబాబు. అన్నింటా లూఠీ చేస్తున్నారనీ… ప్రభుత్వ ఖజానా ఖాళీ చేశారనీ చంద్రబాబు ఆరోపించారు. ఏపీ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి అప్పులు ఇచ్చేవాళ్ళు కూడా దొరకడం లేదని ఎద్దేవా చేశారు. వైసీపీ నేతలు రౌడీయిజం చేస్తున్నారనీ.. తాను అధికారంలో ఉన్నప్పుడు అలాగే ఆలోచించి ఉంటే కుప్పంలో ఆ పార్టీవాళ్లు ఒక్కరూ మిగిలేవారు కాదన్నారు చంద్రబాబు. తొలిరోజు పర్యటనలో రచ్చబండ, రోడ్‌షోలతో ప్రజలను కలిసిన చంద్రబాబు.. మరో రెండ్రోజుల పాటు కుప్పంలోనే ఉండనున్నారు.

Also Read: Telangana: పండుగ గిఫ్ట్.. పారిశుద్ధ్య కార్మికులకు గౌరవ వేతనాలు పెంపు.. ఎంతంటే..?

భార్యతో వివాహేతర సంబంధం! కోపం పట్టలేక.. దమ్ము చక్రాలతో నుజ్జునుజ్జుగా తొక్కించాడు

స్టార్ హీరోల సినిమాల్లో నటించింది.. కానీ
స్టార్ హీరోల సినిమాల్లో నటించింది.. కానీ
తగ్గేదే లే.. 91 ఏళ్ల వయసులోనూ సర్పంచ్‌ బరిలో.. పోటీకి కారణం ఇదే..
తగ్గేదే లే.. 91 ఏళ్ల వయసులోనూ సర్పంచ్‌ బరిలో.. పోటీకి కారణం ఇదే..
35 ఏళ్ల తర్వాత రీఎంట్రీ..ఒకప్పటి ఈ టాలీవుడ్ హీరోను గుర్తుపట్టారా?
35 ఏళ్ల తర్వాత రీఎంట్రీ..ఒకప్పటి ఈ టాలీవుడ్ హీరోను గుర్తుపట్టారా?
16 ఏళ్ల తర్వాత కోహ్లీ-రోహిత్ రీఎంట్రీ.. ఎప్పుడు ఆడతారంటే..?
16 ఏళ్ల తర్వాత కోహ్లీ-రోహిత్ రీఎంట్రీ.. ఎప్పుడు ఆడతారంటే..?
జామపండు మీ హెల్త్ గేమ్ ఛేంజర్.. రోజు ఒకటి తినడం వల్ల ఎన్ని లాభాలో
జామపండు మీ హెల్త్ గేమ్ ఛేంజర్.. రోజు ఒకటి తినడం వల్ల ఎన్ని లాభాలో
రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఛాన్స్ వస్తే నో చెప్పా
రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఛాన్స్ వస్తే నో చెప్పా
మనదేశంలో ఇప్పటివరకు రైలు కూత వినని రాష్ట్రం..! అది ఏ రాష్ట్రమంటే
మనదేశంలో ఇప్పటివరకు రైలు కూత వినని రాష్ట్రం..! అది ఏ రాష్ట్రమంటే
భారత రాష్ట్రపతి vs రష్యా అధ్యక్షుడు.. ఎవరి ఆదాయం ఎంత?
భారత రాష్ట్రపతి vs రష్యా అధ్యక్షుడు.. ఎవరి ఆదాయం ఎంత?
సెంచరీ హాట్రిక్ మిస్సయిందన్న అర్ష్‌దీప్‌ను ఆడుకున్న విరాట్
సెంచరీ హాట్రిక్ మిస్సయిందన్న అర్ష్‌దీప్‌ను ఆడుకున్న విరాట్
నిమ్మకాయ తొక్కలను తీసిపారేయకండి.. అవి చేసే అద్భుతాలు తెలిస్తే..
నిమ్మకాయ తొక్కలను తీసిపారేయకండి.. అవి చేసే అద్భుతాలు తెలిస్తే..