చంద్రబాబు సంక్షేమ పాలనే నాకు శ్రీరామరక్ష: రాయపాటి

ఏపీ సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే తనకు శ్రీరామరక్ష అని అన్నారు టీడీపీ నేత, నరసరావుపేట సిట్టింగ్ ఎంపీ రాయపాటి సాంబశివరావు. ఈ ఎన్నికల్లోనూ సిట్టింగ్ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఆయన చంద్రబాబు పాలనే తనను మరోసారి గెలిపిస్తుందన్న‌ నమ్మకంతో ఉన్నారు. రాష్ట్రంలోని సీనియర్ రాజకీయ నేతల్లో ఒకరైన రాయపాటి ఏడోసారి లోక్‌సభ బరిలో దిగుతున్నారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరిన ఆయనకు చంద్రబాబు నరసరావుపేట ఎంపీ టిక్కెట్ […]

  • Tv9 Telugu
  • Publish Date - 2:45 pm, Fri, 5 April 19
చంద్రబాబు సంక్షేమ పాలనే నాకు శ్రీరామరక్ష: రాయపాటి

ఏపీ సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే తనకు శ్రీరామరక్ష అని అన్నారు టీడీపీ నేత, నరసరావుపేట సిట్టింగ్ ఎంపీ రాయపాటి సాంబశివరావు. ఈ ఎన్నికల్లోనూ సిట్టింగ్ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఆయన చంద్రబాబు పాలనే తనను మరోసారి గెలిపిస్తుందన్న‌ నమ్మకంతో ఉన్నారు. రాష్ట్రంలోని సీనియర్ రాజకీయ నేతల్లో ఒకరైన రాయపాటి ఏడోసారి లోక్‌సభ బరిలో దిగుతున్నారు.

రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరిన ఆయనకు చంద్రబాబు నరసరావుపేట ఎంపీ టిక్కెట్ ఇచ్చారు. ఈసారి ఆయన్ని చంద్రబాబు పక్కన పెట్టారన్న‌ ప్రచారం జరగడంతో రాయపాటి అలక వహించారు. దీంతో ఆయనకు ఇతర పార్టీలు గాలం వేశాయి. అయితే చివరి నిమిషంలో చంద్రబాబు నరసరావుపేట టిక్కెట్ రాయపాటికే ఖరారు చేయడంతో ఆయన వర్గంలో ఉత్సాహం నెలకొంది. ఈసారి కూడా తనదే గెలుపని, లక్ష మెజార్టీ ఖాయమని రాయపాటి ధీమాగా చెబుతున్నారు.