‘అన్నయ్య’ ఎందుకు సైలెంట్ అయ్యాడు?

మెగా స్టార్ చిరంజీవి..తెలుగు ప్రజల అభిమాన హీరో. ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన కొణిదెల శివశంకర వరప్రసాద్…ఒక్కో మెట్టు ఎక్కుతూ తెలుగు తెరపై తిరుగులేని కథానాయకుడిగా వెలిగొందాడు. అన్న ఎన్టీఆర్ తర్వాత దశాబ్ధాల పాటు తెలుగు చిత్ర సీమను తన కను సైగలతో శాసించాడు చిరంజీవి. ఓ సాధారణ కానిస్టేబుల్ కొడుకు నుంచి మొదలై.. మెగా స్టార్‌గా కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న ఆయన జీవితం ఎంతో మందికి ఆదర్శనీయం. ఇప్పటికి మాస్ స్టెప్పులతో సిల్వర్ […]

'అన్నయ్య' ఎందుకు సైలెంట్ అయ్యాడు?
Follow us

| Edited By:

Updated on: Apr 05, 2019 | 3:29 PM

మెగా స్టార్ చిరంజీవి..తెలుగు ప్రజల అభిమాన హీరో. ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన కొణిదెల శివశంకర వరప్రసాద్…ఒక్కో మెట్టు ఎక్కుతూ తెలుగు తెరపై తిరుగులేని కథానాయకుడిగా వెలిగొందాడు. అన్న ఎన్టీఆర్ తర్వాత దశాబ్ధాల పాటు తెలుగు చిత్ర సీమను తన కను సైగలతో శాసించాడు చిరంజీవి. ఓ సాధారణ కానిస్టేబుల్ కొడుకు నుంచి మొదలై.. మెగా స్టార్‌గా కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న ఆయన జీవితం ఎంతో మందికి ఆదర్శనీయం. ఇప్పటికి మాస్ స్టెప్పులతో సిల్వర్ స్రీన్‌ను షేక్ చెయ్యాలంటే మెగా స్టార్‌ను మించిన వాళ్లు సౌత్ ఇండియాలో లేరంటే అతిశయోక్తి కాదేమో. 9 సంవత్సరాల లాంగ్ గ్యాప్ తర్వాత ఖైదీ నెంబర్ 150 చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన చిరూకి బాక్సాఫీస్ అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. కలెక్షన్ల సునామీతో బాస్‌కి తెలుగు స్టేట్స్ అదిరిపోయే వార్మ్ వెల్‌కమ్ తెల్పాయి.

చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని సినీ తారలుగా వెలిగొందిన వారు..ఇప్పటికి రాణిస్తున్న వారు ఎందరో ఉన్నారు. చిన్న చిన్న యాక్టర్స్‌‌కి మాత్రమే రవితేజ, శ్రీకాంత్ లాంటి టాప్ హీరోలకి సైతం చిరు ఇచ్చిన ఆత్మ విశ్వాసమే ఆయుధంగా మారింది. సినీ ఇండస్ట్రీలోని 24 క్రాప్ట్స్‌లో…చిరూను అభిమానించి వచ్చినవాళ్లు ఎంతోమంది ఉంటారు. నమ్మిన పని కోసం నిర్విరామంగా పనిచేయడం, మొదలైన స్థాయిని ఎప్పటికి మర్చిపోకపోవడం, టాలెంట్ ఉన్న వారిని ప్రోత్సహించడం వంటి అంశాలు చిరంజీవిని అందరికి అన్నయ్యను చేశాయి. కెరీర్‌ మొత్తంలో 150 సినిమాలలో తెలుగు ప్రజలను అలరించినందుగాను..ఆంధ్ర విశ్వ విద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్‌తో పాటు..దేశంలో మూడవ అత్యన్నత పౌరపురస్కారమైన పద్మభూషన్ వంటి గౌరవాలు ఆయన పేరు ముందు నిలిచాయి. కేవలం సినిమాల పరంగా మాత్రమే కాదు సామాజిక సేవ పరంగాను చిరంజీవి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఇంతవరకు ఏ చలన చిత్ర నటుడూ ఆలోచించని విధంగా బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ స్థాపించి తనపై ప్రేమను కురిపించిన పేద అభిమానుల, అట్టడుగు వర్గాల రుణం తీర్చుకునే ప్రయత్నం చేశాడు చిరంజీవి.

తెలుగు సినిమా తెరపై చెరపలేని, చెరిగిపోని ముద్ర వేసిన చిరంజీవి..రాజకీయాల్లో మాత్రం తేలిపోయాడు. లక్షల జనసంద్రం మధ్య ప్రజారాజ్యం పార్టీని ఎనౌన్స్ చేసిన చిరంజీవి వారిని ఓటు బ్యాంకుగా మార్చుకోవడంలో మాత్రం తడబ‌డ్డాడు. ఫలితంగా 2009 ఎన్నికల్లో 18 సీట్లతో సరిపెట్టుకున్నాడు.  అప్పట్లో కాకలుతీరిన రాజకీయ నాయకులున్న ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో..చిరంజీవి సరైన అడుగులు వేయలేకపోయారు. పార్టీని నడిపించే సామర్థ్యం కొరవడటం, అనుభవ లేమి, నాయకత్వ లోపం వంటి అంశాలు పార్టీని కృంగదీశాయి. ఫలితంగా ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీతో విలీనం అయ్యింది. కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా, కేంద్రమంత్రిగా పనిచేసినా కూడా..చిరంజీవి తనను నమ్మినవారిని నట్టేట ముంచారనే వాదన బలంగా వినిపించింది. రాష్ట్ర విభజనతో చిరు రాజకీయ భవితవ్యం పూర్తిగా మారిపోయింది. ఏపీ ప్రజలు కాంగ్రెస్‌ను ఏ కోశాన సమ్మతించలేదు. చాలా మంది బడా..బడా నాయకుల డిపాజిట్లు కూడా గల్లంతయ్యాయి. ఇక చేసేది ఏమి లేక చిరు మిన్నకుండిపోయారు. కానీ అనూహ్యంగా పవన్ కళ్యాణ్ రాజకీయ తెరంగేట్రం చిరంజీవికి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది. పవన్ కళ్యాణ్‌ పార్టీ ఆవిర్భాభ సభలో కాంగ్రెస్పై చేసిన తీవ్ర విమర్శలు చిరంజీవిని సందిగ్ధంలో పడేశాయి. వీటిపై ఎలా స్పందించాలో తెలియని చిరంజీవి కొన్నాళ్లు మీడియాకు దూరంగా కూడా ఉన్నారు. ఒకవేళ మీడియా ప్రతినిధులు తారసపడినా..తమ్ముడు మంచి చేయడానికే రాజకీయాల్లోకి వచ్చాడని, నేను కాంగ్రెస్‌తో ఉంటానని…ఎవరి మనస్థత్వాలు వారివే..అంతిమంగా ప్రజాసేవే మా లక్ష్యమంటూ చెప్పుకొచ్చారు. 2014 ఎన్నికల్లో పవన్ టీడీపీ, బీజేపీ కూటమికి మద్ధతివ్వడంతో చిరంజీవిపై అంత ఒత్తిడి రాలేదు. తనను ఇంత స్థాయికి తీసుకువచ్చిన సిల్వర్ స్రీన్‌ పైకి రీ ఎంట్రీ ఇచ్చారు మెగా స్టార్. కానీ ప్రస్తుత ఎన్నికల్లో పవన్ కమ్యూనిష్టు పార్టీలూ, బీఎస్పీ లాంటి తక్కువ జనబలం ఉన్న పార్టీల మద్ధతుతో బరిలోకి దిగుతున్నారు. చంద్రబాబు, జగన్ లాంటి హేమా, హేమీలతో తలపడుతున్నారు. ఇటువంటి సమయంలో పవన్‌‌కు అన్నయ్య మద్దతు ఎంతైనా అవసరం. అయితే చిరంజీవి సైలెన్స్‌కు చాలా కారణాలే అడ్డుగా కనిపిస్తున్నాయి.

1. వారసత్వ, కుటుంబ రాజకీయాలకు పూర్తి వ్యతిరేకమన్న తమ్ముడి పార్టీలో చేరితే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయన్న భావన ఉండటం

2. పార్టీని నడపలేని వ్యక్తిని…మళ్లీ ఎలా తీసుకున్నారంటూ…ప్రతిపక్షాలు విమర్శలు చెయ్యడానికి ఎక్కువ అవకాశాలు ఉండటం

3. అవకాశవాద రాజకీయ నాయకుడిగా చిరంజీవిపై ముద్ర పడే అవకాశం ఉండటం.

4. పవన్ కళ్యాణ్‌ మాటపై, పార్టీ సిద్ధాంతాలపై ప్రభావం చూపే అవకాశాలు ఉండటం.

వంటి కారణాలుతో చిరు సైలెన్స్ మెయింటెన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే చిరంజీవి బయటకు చెప్పకపోయినా నైతిక మద్ధతు పవన్‌కే అని రాజకీయ నిపుణుల నుంచి వినిపిస్తున్న మాట. ఇటీవల తెలంగాణలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొండా విశ్వేశ్వర రెడ్డి తనకు మద్ధతుగా ప్రచారం చేయమని చిరంజీవిని కోరినప్పటికి ఆయన సున్నితంగా తిరస్కరించినట్టు సమాచారం. మరి మెగా రాజకీయం ఎటువైపు మొగ్గుతుందో, ఎవరికి మేలు చేస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Latest Articles
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..