AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీఆర్ఎస్‌లోకి టీడీపీ నేత మండవ.. ఇంటికెళ్లి ఆహ్వానించిన కేసీఆర్

నిజామాబాద్ జిల్లా టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు ఇంటికి సీఎం కేసీఆర్ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనను టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు కేసీఆర్. దీనిపై ఇద్దరు నేతలు కాసేపు చర్చించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో త్వరలోనే మండవ.. టీఆర్ఎస్‌లోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. కాగా నాలుగు దశాబ్దాలుగా మండవ టీడీపీలోనే కొనసాగుతున్నారు. ఈ క్రమంలో గతంలో చంద్రబాబు హయాంలో ఆయన మంత్రిగానూ పనిచేశారు. ఇదిలా ఉంటే తెలంగాణలో టీడీపీకి చెందిన సీనియర్ నేతలందరూ ఇప్పటికే ఇతర […]

టీఆర్ఎస్‌లోకి టీడీపీ నేత మండవ.. ఇంటికెళ్లి ఆహ్వానించిన కేసీఆర్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 05, 2019 | 3:50 PM

Share

నిజామాబాద్ జిల్లా టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు ఇంటికి సీఎం కేసీఆర్ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనను టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు కేసీఆర్. దీనిపై ఇద్దరు నేతలు కాసేపు చర్చించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో త్వరలోనే మండవ.. టీఆర్ఎస్‌లోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. కాగా నాలుగు దశాబ్దాలుగా మండవ టీడీపీలోనే కొనసాగుతున్నారు. ఈ క్రమంలో గతంలో చంద్రబాబు హయాంలో ఆయన మంత్రిగానూ పనిచేశారు. ఇదిలా ఉంటే తెలంగాణలో టీడీపీకి చెందిన సీనియర్ నేతలందరూ ఇప్పటికే ఇతర పార్టీల్లోకి వెళ్లారు. దీంతో తెలంగాణలో ఆ పార్టీ దాదాపుగా ఖాళీ అయిపోయింది.