నఖ్వి నోట ‘మోదీ కా సేన’…చిక్కుల్లో కేంద్ర మంత్రి!
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మాటల తూటాలు పేలుతున్నాయి. ఆర్మీ దేశ ప్రజలందరికి చెందినదని, వ్యక్తులకు వర్తించుకోవడం కుదరదని కేంద్ర మంత్రి వీకే సింగ్ చెప్పినప్పటికీ బీజేపీకి చెందిన కొందరు నేతలు మాత్రం వెనక్కి తగ్గేందుకు ఇష్టపడటం లేదు. ఆర్మీని ‘మోదీ కా సేన’గా పేర్కొని ఇప్పటికే యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈసీ నోటీసులు అందుకోగా, తాజాగా మరో కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వి సైతం ఇదే పాట పాడుతున్నారు. రాంపూర్ అభ్యర్థి జయప్రద తరపున […]

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మాటల తూటాలు పేలుతున్నాయి. ఆర్మీ దేశ ప్రజలందరికి చెందినదని, వ్యక్తులకు వర్తించుకోవడం కుదరదని కేంద్ర మంత్రి వీకే సింగ్ చెప్పినప్పటికీ బీజేపీకి చెందిన కొందరు నేతలు మాత్రం వెనక్కి తగ్గేందుకు ఇష్టపడటం లేదు. ఆర్మీని ‘మోదీ కా సేన’గా పేర్కొని ఇప్పటికే యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈసీ నోటీసులు అందుకోగా, తాజాగా మరో కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వి సైతం ఇదే పాట పాడుతున్నారు.
రాంపూర్ అభ్యర్థి జయప్రద తరపున ప్రచారంలో పాల్గొన్న నఖ్వి…బాలాకోట్ దాడులను విపక్షాలు విమర్శించడంపై విరుచుకుపడ్డారు. ‘మన క్షిపణులు, రక్షణ సిబ్బంది ఉగ్రవాదుల కోటలపై విరుచుకుపడి వారిని ఏరిపారేశారు. ఇదేదో ఆషామాషీ సాహసం కాదు. ఇప్పుడు అసలు సమస్య ఏమిటంటే…మోదీ కా సేన జరిపిన దాడులపై కాంగ్రెస్, ఎస్‌పీ, బీఎస్‌పీ ఆధారాలు అడుగుతోంది’ అని వ్యాఖ్యానించారు.
అయితే, ఆర్మీని మోదీ సేనగా నఖ్వి పేర్కొనడంపై కాంగ్రెస్ భగ్గుమంది. దేశ సైన్యాన్ని తమ ప్రైవేటు ఆర్మీగా మంత్రి ప్రచారం చేసుకోవడంపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని ఆ పార్టీ ప్రతినిధి తెలిపారు. కాగా, ‘మోదీ కా సేన’ వ్యాఖ్యలపై ఇప్పటికే యోగి ఆదిత్యనాథ్‌కు ఈసీ నోటీసు పంపింది. 5వ తేదీ శుక్రవారంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
"Modi ji ki sena" makes another appearance.This time by Mukhtar Abbas Naqvi.Do they genuinely not know they're doing something wrong or are they still doing it inspite of it?pic.twitter.com/HtwQl9jqBf
— Zainab Sikander Siddiqui (@zainabsikander) April 3, 2019



