చిత్తూరు జిల్లా కుప్పంలో బుధవారం (జనవరి 4) ఉద్రిక్తత నెలకొంది. చంద్రబాబు రోడ్‌షోకు అనుమతి లేనందున్న పోలీసులు అడ్డుకున్నారు. మైక్ పర్మిషన్ లేదని 4 ప్రచార రథాలను ఇప్పటికే సీజ్ చేశారు. సమావేశం కోసం శాంతిపురం మండలం కెనుమాకులపల్లి వద్ద ఏర్పాటు చేసిన స్టేజ్‌ను కూడా పోలీసులు తొలగించారు. ఈ క్రమంలో చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు వెళ్తున్న టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు, టీడీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులపై టీడీపీ కార్యకర్తలు దాడికి దిగారు. రోడ్డుపై ఏర్పాటు చేసిన బారికేడ్లను ఎత్తిపడేశారు. ఓ కార్యకర్త పోలీసుపై చేయి చేసుకున్నాడు కూడా.
కాగా గతంలో నిర్వహించిన రెండు సమావేశాల్లో తొక్కిసలాట చోటుచేసుకుని పలువురు మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం తెలుగు దేశం పార్టీకి రోడ్ షోలు, సమావేశాలు నిర్వహించడంపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్ వార్తాకథనాల కోసం క్లిక్ చేయండి.