Sonia Gandhi Health: ఆసుపత్రిలో చేరిన కాంగ్రెస్ మాజీ చీఫ్ సోనియా గాంధీ.. పార్టీ శ్రేణులలో ఆందోళన..
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఢిల్లీలోని ఓ స్థానిక ఆసుపత్రిలో రోటిన్ చెకప్ కోసం అడ్మిట్ అయ్యారు. మంగళవారం నుంచి శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతున్న సోనియా బుధవారం గంగా రామ్ హాస్పిటల్‌లో చేరారు. సోనియా హాస్పిటల్‌కు వెళ్లిన
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఢిల్లీలోని ఓ స్థానిక ఆసుపత్రిలో రోటిన్ చెకప్ కోసం అడ్మిట్ అయ్యారు. మంగళవారం నుంచి శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతున్న సోనియా బుధవారం గంగా రామ్ హాస్పిటల్‌లో చేరారు. సోనియా హాస్పిటల్‌కు వెళ్లిన సమయంలో ఆమె వెంట ప్రియాంక వాద్రా కూడా ఉన్నారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. మంగళవారం నుంచి శ్వాసకోశ సమస్యతో సోనియా బాధపడుతున్నాని, ఆ కారణంగానే రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా ఉత్తరప్రదేశ్‌లో సాగుతున్న జోడో యాత్ర నుంచి వెనుదిరిగారిని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
అయితే దాదాపు తొమ్మిది రోజుల తర్వాత ఢిల్లీలో తిరిగి ప్రారంభమైన భారత్ జోడో యాత్ర మంగళవారం ఘజియాబాద్ వద్ద ఉత్తర ప్రదేశ్‌లోకి ప్రవేశించింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అధికార ప్రతినిధి ప్రియాంక వాద్రా, జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం ఫరుక్ అబ్దుల్లా రాహుల్ పాదయాత్రను యూపీలోకి ఆహ్వానించారు. అనంతరం రా మాజీ చీఫ్ ఏఎస్ దులత్ కూడా పాదయాత్రలో పాల్గొని దానికి మద్దతు పలికారు. యూపీలో 7 కిలో మీటర్ల మేర యాత్ర సాగిన సమయంలో సోనియా ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న రాహుల్, ప్రియాంక అక్కడితో విరామం పలికి ఢిల్లీకి తిరిగి వచ్చారు.
కాగా, సోనియా గాంధీ గతేడాది జూన్ నెలలో కరోనా బారిన పడ్డారు. ఆ క్రమంలోనే జూన్ 12న గంగారామ్ హాస్పిటల్‌లో చేరి అదే నెల 20న డిశ్చార్జ్ అయ్యారు. ఆ తర్వాత కూడా పోస్ట్ కోవిడ్ సమస్యలతో చెకప్‌లు చేయించుకున్నారు. కొద్ది నెలల క్రితమే ఆమె వైద్య పరీక్షల కోసం విదేశాలకు వెళ్లారు. ఇటీవల కర్ణాటక, ఢిల్లీలో భారత్ జోడో యాత్ర ప్రవేశించినప్పుడు రాహుల్ గాంధీతో కలిసి కొంతమేర పాదయాత్రలో పాల్గొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. .