జగన్… తండ్రి వైఎస్సార్‌లాగానే నైతిక విలువలు ఉన్న వ్యక్తి.. సీఎంపై జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశంసల వర్షం

|

Mar 18, 2021 | 2:13 PM

తాడిపత్రి మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికైన  జేసీ ప్రభాకర్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.  సీఎం జగన్ నైతిక విలువలు ఉన్న వ్యక్తి అని ప్రశంసించారు.

జగన్... తండ్రి వైఎస్సార్‌లాగానే నైతిక విలువలు ఉన్న వ్యక్తి.. సీఎంపై జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశంసల వర్షం
Jc Prabhakar Jagan
Follow us on

తాడిపత్రి మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికైన  జేసీ ప్రభాకర్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.  సీఎం జగన్ నైతిక విలువలు ఉన్న వ్యక్తి అని ప్రశంసించారు. ఆయన తండ్రి వైఎస్ లాగానే.. ఆయనలో కూడా విలువలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆ విషయాన్ని తాను ఈరోజు స్పష్టంగా గమనించినట్లు చెప్పారు. సీఎం సహకారం లేకపోతే తాను ఈ రోజు మున్సిపల్ చైర్మన్ అయ్యి ఉండేవాన్ని కాదంటూ జగన్‌ను ప్రశంసించారు. త్వరలో సీఎం జగన్‌ని కలుస్తానని,  తాడిపత్రి అభివృద్ధికి ఎమ్మెల్యే పెద్దారెడ్డి, ఎంపీ తలారి రంగయ్య తో కలిసి పనిచేస్తానని చెప్పుకొచ్చారు.

ఆంధ్రపదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి ఫోకస్ అంతా తాడిపత్రిపైనే ఉంది. రాష్ట్రమంతటా పత్తా లేకుండా పోయిన టీడీపీ.. ఇక్కడ మాత్రం ఉనికి చాటుకుంది. ముఖ్యంగా జేసీ ఫ్యామిలీ ఈ ఎన్నికలను చాలా ప్రస్టేజ్‌గా తీసుకుంది. తాడిపత్రిలో అటు జేసీ ఫ్యామిలీ, ఇటు పెద్దారెడ్డి కుటుంబాల మధ్య హైటెన్షన్ వాతావరణం నడిచిన విషయం తెలిసిందే. సవాళ్లు, ప్రతిసవాళ్లు కూడా జరిగాయి. అయితే అనూహ్యం జేసీ కుటుంబం ఆధిపత్యం ప్రదర్శించింది. ఇక్కడ మొత్తం వార్డులు 36 . టీడీపీ 18 వార్డుల్లో … వైసీపీ 16 వార్డుల్లో గెలిచాయి. సీపీఐ ఒక స్థానం.. ఇండిపెండెంట్‌ మరో స్థానం కైవసం చేసుకున్నాయి. ఎంపీ తలారి రంగయ్య , ఎమ్మెల్సే పెద్దారెడ్డి ఎక్స్‌ అఫిషియో ఓట్లతో వైసీపీ బలం 18కి చేరింది. గెలిచిన 18 మందితోపాటు సీపీఐ, స్వతంత్రుల మద్దతుతో  టీడీపీ ఇక్కడ పాగా వేసింది. జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. తన పార్టీ తరుఫున గెలిచినవారినందర్నీ క్యాంప్‌కు తీసుకెళ్లిన జేసీ వర్గం.. వారందర్నీ జాగ్రత్తగా కాపాడుకుంది. అయితే ఈ మున్సిపాలిటీని దక్కించుకునేందుకు వైసీపీ కూడా పెద్దగా ఇంట్రస్ట్ చూపించలేదనే చెప్పాలి. వైసీపీ కూడా ఇక్కడ పాగా వేయాలని భావిస్తే సీన్ వేరేలా ఉండేదని రాజకీయ నిపుణులు చెబుతున్నారు.

 

Also Read: TTD Kalyanamastu: బంగారం లాంటి వార్త చెప్పిన టీటీడీ.. వారికి గ్రాము కాదు, రెండు గ్రాముల గోల్డ్

Telangana News: ఒకే తాటిచెట్టుపై 17మంది ఎక్కారు… అరెరే ఏంటీ చిత్రం.. తెలుసుకుందాం పదండి