
నంద్యాల లోక్‌సభ నియోజకవర్గం నుంచి జనసేన తరపున పోటీ చేస్తోన్న సిట్టింగ్ ఎంపీ ఎస్పీవై రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. గత వారం ఎన్నికల ప్రచారంలో అస్వస్థతకు గురైన ఆయనను.. హైదరాబాద్‌కు తరలించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత ఐదు రోజులుగా ఆయనకు చికిత్స జరుగుతున్నా కోలుకోవడం లేదు. దీంతో ఎస్పీవై రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై జనసేన వర్గాల్లో ఆందోళన నెలకొంది.
అయితే 2014లో వైసీపీ నుంచి ఎంపీగా గెలిచిన ఎస్పీవై రెడ్డి.. ఆపై టీడీపీలోకి వెళ్లారు. ఇక ఈ ఎన్నికల్లో ఆయనకు టీడీపీ టికెట్ నిరాకరించడంతో.. జనసేనలో చేరి ఆ పార్టీ తరపున బరిలో నిలిచిన విషయం తెలిసిందే.