టార్గెట్ 2024.. వేడెక్కుతున్న ఢిల్లీ రాజకీయం.. సోనియా ఆధ్వర్యంలో మరో కీలక భేటీ..!

|

Feb 20, 2022 | 2:21 PM

2024 సార్వత్రిక ఎన్నికలే టార్గెట్‌.. గెలుపే లక్ష్యంగా రూట్‌మ్యాప్‌.. ప్రతిపక్షాలన్నిటినీ ఏకతాటిపైకి తీసుకురావాలని వ్యూహం రచిస్తున్నారు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ.

టార్గెట్ 2024.. వేడెక్కుతున్న ఢిల్లీ రాజకీయం.. సోనియా ఆధ్వర్యంలో మరో కీలక భేటీ..!
Sonia Gandhi
Follow us on

2024 సార్వత్రిక ఎన్నికలే (National Elections)టార్గెట్‌.. గెలుపే లక్ష్యంగా రూట్‌మ్యాప్‌.. ప్రతిపక్షాలన్నిటినీ(Opposition parties meeting) ఏకతాటిపైకి తీసుకురావాలని వ్యూహం రచిస్తున్నారు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ(Sonia Gandhi). సోనియా ఆధ్వర్యంలో త్వరలో ఢిల్లీలో కీలక సమావేశం జరగనుంది. ప్రస్తుతం జరుగుతున్న 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత ఈ భేటీ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేశారు సోనియాగాంధీ. ప్రస్తుతం ఫైవ్‌ స్టేట్స్‌లో ఎలక్షన్స్‌ జరుగుతున్నాయని..పార్టీలన్నీ ఆ ఎన్నికల్లో బిజీగా ఉన్నందున..ఫలితాల తర్వాత ఈ సమావేశం ఉంటుందని ప్రకటించారు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో విపక్షాలన్నింటినీ కలుపుకుపోయేలా సంప్రదింపులు జరుపుతున్నారాయన.

గతంలోనూ పలుమార్లు ప్రతిపక్ష పార్టీల సమావేశం జరిగింది. గతేడాది ఆగస్టులో జరిగిన సమావేశానికి 19 పార్టీలు హాజరయ్యాయి. ఆ సమావేశంలో రానున్న ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా..తమతో అన్ని పార్టీలు కలిసి రావాలని పిలుపునిచ్చారు సోనియా. ఇక త్వరలో జరగబోయే సమావేశంలో 2024 ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు నేతలు.

ఇవి కూడా చదవండి: UP-Punjab Election 2022 Voting Live: ఉత్తర ప్రదేశ్, పంజాబ్‌ల్లో జరుగుతున్న ఎన్నికల పోలింగ్ అప్‌డేట్ కోసం ఇక్కడ చూడండి..

LAW: తండ్రి ఆస్తిపై కుమార్తెకు హక్కు ఉంటుందా.. లా ఏం చెబుతుంది..