శివసేనకు మద్దతా ? నో ! నో !… సోనియా

| Edited By:

Nov 05, 2019 | 3:49 PM

మహారాష్ట్రలో శివసేనకు మద్దతునిచ్ఛే ప్రసక్తే లేదని కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ ప్రకటించారు. తమకు శత్రు పక్షమైన బీజేపీతో పొత్తు పెట్టుకున్న సేనకు మద్దతు ఎలా ఇస్తామని ఆమె ప్రశ్నించారు. సోమవారం సాయంత్రం తనతో భేటీ అయిన ఎన్సీపీ సీనియర్ నేత శరద్ పవర్ కి ఆమె ఈ మేరకు స్పష్టం చేశారు. మహారాష్ట్రలో బీజేపీని అధికారంలోకి రాకుండా చూసేందుకు అవసరమైతే తాము మీతో (ఎన్సీపీతో) చేతులు కలుపుతామని సోనియా సూచనప్రాయంగా చెప్పినట్టు తెలుస్తోంది. కానీ.. ఈ సమావేశంలో […]

శివసేనకు మద్దతా ? నో ! నో !... సోనియా
Follow us on

మహారాష్ట్రలో శివసేనకు మద్దతునిచ్ఛే ప్రసక్తే లేదని కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ ప్రకటించారు. తమకు శత్రు పక్షమైన బీజేపీతో పొత్తు పెట్టుకున్న సేనకు మద్దతు ఎలా ఇస్తామని ఆమె ప్రశ్నించారు. సోమవారం సాయంత్రం తనతో భేటీ అయిన ఎన్సీపీ సీనియర్ నేత శరద్ పవర్ కి ఆమె ఈ మేరకు స్పష్టం చేశారు. మహారాష్ట్రలో బీజేపీని అధికారంలోకి రాకుండా చూసేందుకు అవసరమైతే తాము మీతో (ఎన్సీపీతో) చేతులు కలుపుతామని సోనియా సూచనప్రాయంగా చెప్పినట్టు తెలుస్తోంది. కానీ.. ఈ సమావేశంలో నిర్దిష్టంగా ఎలాంటి పరిష్కారాన్నీ నేతలు కనుగొనలేకపోయారు. సమీప భవిష్యత్తులో తాను మరోసారి సోనియాతో భేటీ కావచ్ఛునని పవార్ తెలిపారు. నిన్న ఆమెతో తాను జరిపిన చర్చల్లో ఎలాంటి సానుకూల ఫలితమూ రాలేదని ఆయన పేర్కొన్నారు. అయితే సీఎం పోస్టుకోసం తహతహలాడుతున్న శివసేన.. ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలతోకలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గల అవకాశాలను పరిశీలిస్తోంది. సేన సీనియర్ నేత సంజయ్ రౌత్.. గవర్నర్ ను కలిసి రాష్ట్రంలోని తాజా పరిస్థితులను వివరించారు. అతి పెద్ద పార్టీగా అవతరించిన పార్టీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాల్సిందిగా ఆయన గవర్నర్ ను కోరారు.


ఇదే సమయంలో శివసేన.. తన దూతలను ఎన్సీపీ వద్దకు పంపింది. ఇందులో భాగంగానే సంజయ్ రౌత్… ఆ పార్టీ నేత శరద్ పవార్ తో కొద్దిసేపు భేటీ అయ్యారు. తను ఆయనను మర్యాదపూర్వకంగానే కలిసినట్టు రౌత్ చెప్పినప్పటికీ.. ఈ భేటీలోని మర్మమేమిటో తెలుస్తూనే ఉంది. అటు-శివసేన, బీజేపీ మధ్య పేచీ వారి సొంత వ్యవహారమని, తనకు సేన ఎలాంటి హామీని ఇవ్వలేదని పవార్ వెల్లడించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైనంత బలం తమకు లేదని, అందువల్లే ప్రతిపక్షంలో కూర్చుంటామని తాను చెప్పానని ఆయన అన్నారు. రాష్ట్ర అసెంబ్లీ కాలపరిమితి ఈ నెల 8 తో ముగియనుంది. ఆ లోగా ప్రభుత్వం ఏర్పడకపోయిన పక్షంలో ఇక రాష్ట్రపతి పాలనే శరణ్యం కాక తప్పదు.

ఆర్ఎస్ఎస్ జోక్యం కోరిన సేన..

మహారాష్ట్రలో అధికార పంపిణీపై బీజేపీ-శివసేన మధ్య తలెత్తిన ‘ తగాదా ‘ ఎంతకూ పరిష్కారం కాకపోవడంతో.. శివసేన.. ఆర్ఎస్ఎస్ ‘ శరణు ‘ జొచ్చింది. ఈ ప్రతిష్ఠంభన పరిష్కారానికి సహాయపడాలని ఆ సంస్థ చీఫ్ మోహన్ భగవత్ ని కోరింది. ఈ మేరకు సేన నేత కిషోర్ తివారీ ఆయనకు లేఖ రాశారు.పరిస్థితిని ‘ కూల్ ‘ చేసేందుకు మీరు జోక్యం చేసుకోవలసిందే అని ఆయన అభ్యర్థించారు. బీజేపీ ‘ సంకీర్ణ ధర్మాన్ని ‘ పాటించడంలో విఫలమైందని ఆయన ఆరోపించారు. బీజేపీ-సేన కూటమికి అనుకూలంగా ఈ రాష్ట్ర ప్రజలు తీర్పును ఇచ్చారని, కానీ నూతన ప్రభుత్వం ఏర్పాటులో ఆ పార్టీ ఈ ధర్మాన్ని పాటించడంలేదన్నారు. అయితే ఈ లేఖపై ఆర్ ఎస్ ఎస్ నుంచి ఇంకా ఎలాంటి స్పందనా రాలేదు.