నాగబాబుపై శివాజీరాజా వివాదాస్పద వ్యాఖ్యలు

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం జనసేన అభ్యర్థి నాగబాబుపై సినీ నటుడు, వైసీపీ నేత శివాజీరాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. భీమవరంలో ఆదివారం నాటి ప్రచార సభలో పాల్గొన్న శివాజీ రాజా మాట్లాడుతూ.. నాగబాబు లాంటి వ్యక్తికి కాకుండా మంచి వ్యక్తికి ఓటువేయండని, ఆయనకు ఓటేస్తే నష్టపోతామన్నారు. తమ తాత, ముత్తాతల నుంచి తామంతా భీమవరంలోనే పుట్టామని.. నరసాపురం నియోజకవర్గాన్ని కాపాడుకోవాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. ‘మా’ అధ్యక్షుడిగా నాగబాబు రెండేళ్లు పదవిలో ఉండి అసోసియేషన్‌ను […]

నాగబాబుపై శివాజీరాజా వివాదాస్పద వ్యాఖ్యలు

Edited By:

Updated on: Apr 07, 2019 | 6:17 PM

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం జనసేన అభ్యర్థి నాగబాబుపై సినీ నటుడు, వైసీపీ నేత శివాజీరాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. భీమవరంలో ఆదివారం నాటి ప్రచార సభలో పాల్గొన్న శివాజీ రాజా మాట్లాడుతూ.. నాగబాబు లాంటి వ్యక్తికి కాకుండా మంచి వ్యక్తికి ఓటువేయండని, ఆయనకు ఓటేస్తే నష్టపోతామన్నారు. తమ తాత, ముత్తాతల నుంచి తామంతా భీమవరంలోనే పుట్టామని.. నరసాపురం నియోజకవర్గాన్ని కాపాడుకోవాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. ‘మా’ అధ్యక్షుడిగా నాగబాబు రెండేళ్లు పదవిలో ఉండి అసోసియేషన్‌ను రెండు సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లాడని మండిపడ్డారు.