ప్రియాంకా.. నువ్వు అన్నంతమాత్రాన.. అలా అయిపోతారా..? : అమిత్ షా

| Edited By:

May 07, 2019 | 8:40 PM

ప్రధాని మోదీపై ప్రియాంక చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా కౌంటర్ అటాక్ చేశారు. హర్యానాలో ఓ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ దుర్యోధనుడిలా అహంకారి అంటూ ప్రియాంకా గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే, దీనిపై అమిత్ షా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రియాంక గాంధీ చేస్తున్న వ్యాఖ్యలు కాంగ్రెస్ లో నెలకొన్న అసహనానికి సూచికలు అని అన్నారు. ఆమె అలా పిలిచినంత మాత్రాన ఎవరూ దుర్యోధనుడు అయిపోరని.. మే 23న వచ్చే […]

ప్రియాంకా.. నువ్వు అన్నంతమాత్రాన.. అలా అయిపోతారా..? : అమిత్ షా
Follow us on

ప్రధాని మోదీపై ప్రియాంక చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా కౌంటర్ అటాక్ చేశారు. హర్యానాలో ఓ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ దుర్యోధనుడిలా అహంకారి అంటూ ప్రియాంకా గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే, దీనిపై అమిత్ షా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రియాంక గాంధీ చేస్తున్న వ్యాఖ్యలు కాంగ్రెస్ లో నెలకొన్న అసహనానికి సూచికలు అని అన్నారు. ఆమె అలా పిలిచినంత మాత్రాన ఎవరూ దుర్యోధనుడు అయిపోరని.. మే 23న వచ్చే ఎన్నికల ఫలితాలు మీకు గట్టి గుణపాఠం నేర్పుతాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని అవమానకర రాజకీయాలు చేసినా.. ఓటర్ల మనసు మాత్రం మార్చలేదని షా అన్నారు.