తెలంగాణ బీజేపీలో(Telangana BJP) మరోసారి అసంతృప్తి సెగ రాజుకుంది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కి(Bandi Sanjay) వ్యతిరేకంగా.. పలువురు నేతలు రహస్యంగా భేటీ కావడం కలకలం రేపుతోంది. మాజీ ఎమ్మెల్యే గజ్జుల రామకృష్ణారెడ్డి(Gujjula Rama Krishna Reddy) అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. దీంతో, కాషాయ పార్టీలో అసమ్మతి నేతల వ్యవహారం.. మరోసారి తెరమీదకు వచ్చింది. ఈ భేటీలో ప్రధానంగా బండి సంజయ్ ఒంటెటత్తు పోకడలపైనే నేతలు చర్చించినట్టు తెలుస్తోంది. అయితే, అసంతృప్త నేతలకు భయపడేది లేదంటున్నారు బండి సంజయ్. అలాంటి వారికి స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. బీజేపీ అత్యంత క్రమశిక్షణ కలిగిన పార్టీయన్న సంజయ్.. ఎంతటి సీనియర్ నాయకులైనా సరే…. పార్టీ సిద్దాంతాలు, విధానాలకు లోబడి పనిచేయాల్సిందేనని స్పష్టం చేశారు.
కట్టుతప్పితే సహించే ప్రసక్తే లేదన్నారు. ఏ పార్టీలోనైనా ఇలాంటి అసమ్మతి వాదులుంటారనీ.. వారు పనిచేయకుండా.. పనిచేసేవాళ్లపై అక్కసు గక్కడమే పనిగా పెట్టుకుంటారని విమర్శించారు. గతంలోనూ, గజ్జుల రామకృష్ణారెడ్డి నేతృత్వంలో ఇలాంటి రహస్య సమావేశాలు జరిగాయి. బండి సంజయ్ వన్ మ్యాన్ షో చేస్తున్నారంటూ అసంతృప్తితో రగిలిపోతున్న కొందరు నేతలు.. రామకృష్ణారెడ్డి నాయకత్వంలో రహస్యంగా భేటీ అయ్యారు.
దీనిపై, బీజేపీ అధిష్టానం కూడా ఆరా తీసింది. ఆ నేతలెవరు? ఎందుకిలా చేస్తున్నారు? అనే విషయంపై క్లారిటీ తీసుకోవాలంటూ… సీనియర్ నేత ఇంద్రసేనా రెడ్డిని రంగంలోకి దింపింది. ఇలాంటివి సహించేది లేదంటూ.. సీరియస్ వార్నింగే ఇచ్చింది బీజేపీ హైకమాండ్. అంతేకాదు, ఆ మధ్య బండి సంజయ్‌పై ఫిర్యాదు చేసేందుకు కొందరు నేతలు ఢిల్లీ వెళ్తే… పార్టీ కోసం అసలు మీరేం చేస్తున్నారంటూ.. ఎదురు ప్రశ్నించారట హైకమాండ్ నేతలు.
చేస్తే పార్టీకోసం పనిచేయండి.. కుదిరితే సంజయ్‌కి సహకరించండి.. లేదంటే మూసుక్కోర్చోండి అంటూ గట్టిగానే చెప్పారట. అయితే, ఇప్పుడు మరోసారి బీజేపీనేతలు అసంతృప్తరాగం ఎత్తుకోవడం.. కాషాయదళంలో అలజడి రేపుతోంది. బండి సంజయ్ కూడా అంతే ధీటుగా బదులివ్వడంతో.. కాషాయపార్టీలో కల్లోలం ఇప్పట్లో చల్లారేనా? అనే డౌట్స్ వస్తున్నాయి. దీనిపై బీజేపీ హైకమాండ్ ఏం చేయనుందనేది ఆసక్తిగా మారింది.
ఇవి కూడా చదవండి: History of Chicken 65: యమ్మీ..యమ్మీ.. చికెన్ 65.. దీనికి ఆ పేరు ఎలా వచ్చిందంటే..
Telangana BJP: బండెనక బండి కట్టి.. నియోజకవర్గాలకు దూరమవుతున్న ఆ కమలం నేతలు..