Sajjala: ‘ఏపీ ఎలా పోతుందో మీకెందుకు ?’.. తెలంగాణ మంత్రి కామెంట్స్‌కు సజ్జల కౌంటర్

|

Nov 12, 2021 | 7:16 PM

ప్రభుత్వాన్ని నడపడం కోసం ఏపీ సీఎం వైఎస్ జగన్ కేంద్రం వద్ద బిచ్చమెత్తుకుంటున్నారంటూ తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇరు రాష్ట్రాల్లో కాక రేపుతున్నాయి.

Sajjala: ఏపీ ఎలా పోతుందో మీకెందుకు ?.. తెలంగాణ మంత్రి కామెంట్స్‌కు సజ్జల కౌంటర్
Sajjala
Follow us on

ప్రభుత్వాన్ని నడపడం కోసం ఏపీ సీఎం వైఎస్ జగన్ కేంద్రం వద్ద బిచ్చమెత్తుకుంటున్నారంటూ తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇరు రాష్ట్రాల్లో కాక రేపుతున్నాయి.  తెలంగాణ మంత్రి ప్రశాంత్‌రెడ్డి వ్యాఖ్యలపై రియాక్ట్‌ అయ్యారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల. తాము బిచ్చం ఎత్తుకుంటున్నారని తెలంగాణ నేతలు మాట్లాడితే అది వారి విచక్షణకే వదిలేస్తున్నామన్నారు. కేంద్రం నిధులను రావాల్సిన పద్ధతుల్లో రాబట్టుకుంటున్నామన్నారు. హక్కు ఉందని రోజూ చొక్కాపట్టి నిలదీయలేమని.. కేంద్ర నిధుల సాధనలో ఒక్కో రాష్ట్రానిది ఒక్కో పద్ధతని చెప్పుకొచ్చారు. వారు ఎలా పోవాలో వారు చూసుకోవాలని, ఏపీ ఎలా పోతే వారికేమిటని ప్రశ్నించారు. తెలంగాణలో ప్రజల సమస్యల నుంచి తప్పించుకునేందుకే ఈ వ్యాఖ్యలన్నారు.  ఏపీలో ప్రెసెన్స్‌ లేని టీఆర్‌ఎస్‌.. ఇక్కడి అంశాల గురించి కామెంట్ చేయడం సరైంది కాదన్నారు.

కేంద్ర నిధులు రాష్ట్రాల హక్కు అని కేసీఆరే అన్నారని.., ఆయన మాటలు తెలంగాణ మంత్రులు వినలేదేమోనని ఎద్దేవా చేశారు. కేసీఆర్ మెప్పు కోసం కొందరు మంత్రులు ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.  అన్ని రీసోర్సులు హైదరాబాద్‌లో ఉన్నాయని..  రాష్ట్రాన్ని విడదీసి అన్యాయం చేశారని తాము అప్పుడే చెప్పామని సజ్జల గుర్తు చేశారు. విభజన నాడే హైదరాబాద్‌లో వాటా కోరామని సజ్జల చెప్పారు.  రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడమనేది రాజకీయ విధానాలకు సంబంధించిన అంశమని పేర్కొన్నారు. దేనికెంత విద్యుత్ ఇస్తున్నామో తెలిసేందుకే మీటర్ల బిగిస్తున్నట్లు వెల్లడించారు. మీటర్లకు, రైతులకు సబ్సిడీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఏపీలో టీడీపీ నేతల్లాగే.. టీఆర్‌ఎస్ నేతలు మాట్లాడుతున్నారన్నారు.

Also Read: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను ప్రకటించిన వైసీపీ

Samantha: ‘మంచి జరగబోతుందని గుర్తుపెట్టుకోండి’.. వైరల్ అవుతోన్న సమంత పోస్ట్